ఉమ్మడి జిల్లాలో 11 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-10-21T05:33:51+05:30 IST
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం 8,298 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
మహబూబ్‌నగర్, అక్టోబరు 20 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం 8,298 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2302 పరీక్షలకు నాలుగు కేసులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 776 పరీక్షలకు రెండు కేసులు, నారాయణపేట జిల్లాలో 226 పరీక్షలకు మూడు కేసులు, నాగర్‌కర్నూలు జిల్లాలో 2217 పరీక్షలకు రెండు కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 2777 పరీక్షలకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు.