పరిశ్రమల స్థాపనకు 106 దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-02-06T04:32:15+05:30 IST

పేట జిల్లాలో టీఎస్‌ఐపాస్‌ కింద పరిశ్రమల స్థాపనకు 106 దరఖాస్తులు వచ్చాయని డీఐపీసీ/ టీఎస్‌ఐపాస్‌ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌ హరిచందన అన్నారు.

పరిశ్రమల స్థాపనకు 106 దరఖాస్తులు
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ హరిచందన

-  కలెక్టర్‌ హరిచందన 



నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 5 : పేట జిల్లాలో టీఎస్‌ఐపాస్‌ కింద పరిశ్రమల స్థాపనకు 106 దరఖాస్తులు వచ్చాయని డీఐపీసీ/ టీఎస్‌ఐపాస్‌ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌ హరిచందన అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని సమావేశం హాల్‌లో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. నారాయణపేట జిల్లా ఏర్పడిన ప్పటి నుంచి ఇప్పటివరకు టీఎస్‌ఐపాస్‌ కింద పరిశ్రమల స్థాపనకు 106 దరఖా స్తులు రాగా వాటిలో 93 దరఖాస్తులకు అ నుమతులు ఇచ్చినట్లు తెలిపారు. టిప్రైడ్‌ వాహనాల కోసం జిల్లాలో మొత్తం 25 మం ది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా వారిలో ఎస్సీ 16, ఎస్టీ 6, వికలాంగులు 3 దరఖాస్తు దారులు ఉన్నారన్నారు. మహిళలకు 45శా తం, పురుషులకు 35శాతం సబ్సిడీని మం జూరు చేశామని సీనియారిటి లిస్టు ప్రకారం సబ్సిడీని వారి వారి ఖాతాల్లో జమ చేస్తామ న్నారు. జిల్లాకు కేటాయించిన టార్గెట్‌ను ఈనెల 20వ తేదీ లోపు పూర్తి చేయాలని బ్యాంకు కోఆర్డినేట ర్లకు కలెక్టర్‌ సూచించా రు. సమావేశంలో పరి శ్రమల శాఖ ఎండీ రామసుబ్బారెడ్డి, మధు సూదన్‌రెడ్డి, ఎల్డీఎం ట్రాన్స్‌కో, ట్రాన్స్‌పోర్ట్‌, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌, గ్రౌండ్‌ వాటర్‌, ఫైర్‌, కమర్షియల్‌, రెవెన్యూశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T04:32:15+05:30 IST