వైఎస్‌ చేసిన అభివృద్ధే శాశ్వతం

ABN , First Publish Date - 2021-09-03T04:44:31+05:30 IST

వైఎస్‌ చేసిన అభివృద్ధే శాశ్వతం

వైఎస్‌ చేసిన అభివృద్ధే శాశ్వతం
వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న భట్టి విక్రమార్క

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 

ఖమ్మంలో వర్ధంతి కార్యక్రమం
ఖమ్మం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతిప్రతినిధి):
ఉమ్మడి రాష్ట్ర సీఎంగా దివం గత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలు శాశ్వతం గా నిలిచిపోతాయని, ఆయన ఆదర్శనాయకుడని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వైఎస్‌వర్ధంతి కార్యక్రమంలో ఆయన రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అనుమతితో ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి గొప్ప కార్య క్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేదలకు కార్పొ రేట్‌ వైద్యం, ఉచిత విద్యుత్‌, రుణమాఫీ ద్వారా రైతుల అభ్యున్నతి, ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉన్నతచదువులు చదివి విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో అన్ని మతాల్లోని పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించారని గుర్తు చేశారు. నదులు, వాగుల్లో వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు జలయజ్ఞం ద్వారా లిప్టులు, ప్రాజెక్టులు నిర్మించారన్నారు. ప్రతిపక్ష నాయకులు ఏ సమస్యపై వచ్చినా, వారిని గౌరవించి, సమస్య విని పరిష్కరించే తత్వం కలిన గొప్ప నేత వైఎస్‌ఆర్‌ అని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగతదూషణలు, పరుషపదజాలాల సంస్కృతి ఎక్కువైందన్నారు. ఈ ధోరణి సమాజానికి మంచిది కాదన్నారు. వైఎస్‌ హయాంలో తనకు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీప్‌విప్‌గా పనిచేసే అవ కాశం లభించడం గర్వంగా ఉందని భట్టి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్‌, నగర అధ్యక్షుడు జావీద్‌తోపాటు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు, యువజన కాంగ్రెస్‌, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T04:44:31+05:30 IST