రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-11-03T04:57:39+05:30 IST

కృష్ణాజిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బండి రాజేష్‌(26) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఎర్రుపాలెం, నవంబరు2: కృష్ణాజిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన  బండి రాజేష్‌(26) మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై తండ్రి రవితో కలిసి వస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున విజయవాడ భద్రాచలం హైవేపై మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజీ సమీపంలో వారి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. స్థానికులు ఇది గమనించి ఆసుపత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజేష్‌  ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఇలా జరగడం ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

కారు ఢీకొని మరొకరు...

ఖమ్మంక్రైం, నవంబరు2: కారు ఢీకొని ఓ యువకడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం ఖమ్మం ఖానాపురం హవేలి పోలీస్‌స్టేషన్‌ పరిదిలో జరిగింది. గోల్లగూడేనికి చెందిన ఆవుల కోటేశ్వరరావు(26) వందనం గ్రామంలోని తన అత్తగారింటికి వెళుతున్నాడు. గోపాలపురం సమిపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న   కారు అతివేగంగా వస్తూ  ఢీకొట్టింది. దీంతో కోటేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-11-03T04:57:39+05:30 IST