యోగాతో వ్యాధులు దూరం

ABN , First Publish Date - 2021-06-22T04:53:06+05:30 IST

యోగా చేయడం ద్వారా రోగాలు దూరమవుతాయని పలువురు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు యోగా శిక్షకులు వివిధ రకాల ఆసనాలు వేసి ప్రజల్లో అవగాహన కల్పించారు.

యోగాతో వ్యాధులు దూరం
కొత్తగూడెం ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమంలో యోగ సాధన చేస్తున్న మహిళలు

ఆనందమయ జీవితానికి దోహదం

పలువురి శిక్షకులు, అధికారులు ఉద్ఘాటన

జిల్లా వ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం

ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం/ ఇల్లెందు టౌన్‌/  కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌/ మణుగూరుటౌన్‌/ దమ్మపేట/ కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, జూన్‌ 21: యోగా చేయడం ద్వారా రోగాలు దూరమవుతాయని పలువురు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు యోగా శిక్షకులు వివిధ రకాల ఆసనాలు వేసి ప్రజల్లో అవగాహన కల్పించారు.

సింగరేణి కార్పోరేట్‌ ఆధ్వర్యంలో రైటర్‌ బస్తీలోగల ప్రకృతి ఆశ్రమంలో జరిగిన యోగా అభ్యాసనలో డైరెక్టర్‌ ఎన్‌. బల రాం పాల్గొని వివిధ రకాల యోగాసనాలు సాధన చేశారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ... మన భారతీయ సాంప్రదాయంలో యోగా అభ్యాసన చాలా పురాతన మైనదని, దీన్ని ఆచరించి ప్రాచీన భారతీయులు ఎంతో ఆరోగ్యంగా జీవించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కే. బసవయ్య ప్రసంగిస్తూయోగా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కార్పోరేట్‌లోని సెంట్రల్‌ వర్క్‌ షాపులో ఎస్‌ఈ (ఈ అండ్‌ ఎం) రామశేషయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన  కార్యక్రమంలో ఉద్యోగులందరూ పాల్గొని యోగ సాధన చేశారు. 

యోగ సాధన ద్వారా ఆనందమయ జీవితం మన సొంత మవుతుందని సింగరేణి డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎస్‌. చంద్ర శేఖర్‌ డైరెక్టర్‌ (ఈ అండ్‌ ఎం) డి. సత్యనారా యణరావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భగా సో మవారం ఇళ్లల్లోనే సాధన చేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాం తతను, అలౌకిక ఆనందాన్ని పొందవచ్చని జీఎం (కో-ఆర్డినేషన్‌, మార్కెటింగ్‌) సూర్యనారాయణ చెప్పారు.

సింగరేణి ఇల్లెందు జీఎం కార్యాలయంలో జరిగిన యోగా వేడుకల్లో జీఎం మల్లెల సుబ్బారావు  ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్మికులు, అధికారులు వారి కుటుంబస భ్యులు ఆసనాలు వేశారు. సింగరేణి పాఠశాల గ్రౌండ్‌లో వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో యోగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్‌క్లబ్‌ అధ్యక్షుడు దంతాల ఆనంద్‌, స్కౌట్స్‌అండ్‌గైడ్స్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ కమిషన్‌ ముత్తబోయిన శ్రీనివాసరావు, కార్యదర్శి మాచర్ల క్రాంతి, అప్పలరాజు, రాంబాబు, విశ్వనాథం, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

మానసిక ఒత్తిడిని జయించొచ్చు

మానసిక ఒత్తిడిని జయించాలంటే యోగాతోనే సాధ్యపడు తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) అన్నారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో యోగా సాధన చేశారు. కొత్తగూడెం సింగరేణి డిగ్రీ మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్‌ శారదా, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ ఆధ్వర్యంలో నిత్య యోగా కేంద్రంలో రవిశంకర్‌ గురూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుమలాపురం స త్యనారాయణ, ఈసం రమాదేవి, మోకాళ్ల నాగ స్రవంతి, హరిహరణ్‌ యాదవ్‌, సుద్దాల శంకర్‌, ప్రభాకర్‌, ప్రసాద్‌, యోగా అభ్యాసకులు, శిక్షకులు రమాదేవి, కమలా, శారదా, ఇందు, మంజు, లక్ష్మీ, శ్రీదేవి, నిహారిక, హర్షిత, సమీనా, సుగుణారావు, మార్తాండ వెంకట నరసింహా, బోగ శ్రీని వాస్‌, అచ్యుతరావు, విజయలక్ష్మీ, నిర్మల, రాఘవన్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

యోగాతో అన్ని రుగ్మతలు మాయం

యోగాతో అన్ని రుగ్మతలను పారదోల వచ్చని ఏరియా జీఎం జక్కం రమేష్‌ అన్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇంటింటి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఏరియా జిఎం ఉదయాన్నే యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహా బాగ్యమన్నది అక్షర సత్యమని, మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని సుఖ, సంతోషాలను అనుభవించగలుగుతాడన్నారు. 

అందరూ యోగా సాదన చేయాలి

అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా సాధన చేయాలని మూర్తి గురూజీ పిలుపునిచ్చారు. యోగా దినోత్సవం సందర్భంగా గాయత్రిమాత ఆలయ ప్రాంగణంలో సోమవారం ఆసనాలు వేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ భూక్యా ప్రసాదరావు, ఉడతనేని విశేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:53:06+05:30 IST