ఇల్లెందులో అడ్డగోలు తవ్వకాలు

ABN , First Publish Date - 2021-07-09T04:55:50+05:30 IST

లక్షలాది రూపాయలు వెచ్చించి చేపట్టిన రహదారి పనులు మిషన్‌ భగీరధ పనులతో ధ్వంసం అవుతున్నాయి.

ఇల్లెందులో అడ్డగోలు తవ్వకాలు
బస్టాండ్‌ సెంటర్‌లో రోడ్డు విధ్వంసం

సీసీ రోడ్లు ధ్వంసం
పట్టించుకోని పబ్లిక్‌ హెల్త్‌ విభాగం అధికారులు
ఇల్లెందుటౌన్‌, జూలై 8:
లక్షలాది రూపాయలు వెచ్చించి చేపట్టిన రహదారి పనులు మిషన్‌ భగీరధ పనులతో ధ్వంసం అవుతున్నాయి. మునిసిపాలిటి అధికారులు, ప్రజా ప్రతినిధులు వేసిన రోడ్లన్ని మిషన్‌భగీరధపరం అవు తున్న ప్పటికీ పట్టించుకునే వారు కరువయ్యారు. ఇల్లెందు ముని సిపాలిటిలో వివిధ వార్డుల్లో పైపులైన్‌ నిర్మాణం కోసం మిషన్‌ భగీరధ పనులను పబ్లిక్‌ హెల్త్‌ విభాగం ద్వారా గత మూడు నెలలుగా చేపట్టారు. వార్డుల్లో సందుల్లో, గొందుల్లో వేసిన రహదారులపై మిషన్‌భగీరధ పైపులను వేస్తున్నారు. అయితే మునిసిపల్‌ అధికారుల అనుమతులతో రహదారు లను తవ్వాల్సి ఉన్నప్పటీకీ ఎలాంటి అనుమతులు లేకుం డానే అడ్డగోలుగా మిషన్‌లతో తవ్వకాలు చేస్తున్నారు. తవ్వ కాలు చేసిన రహదారులను తిరిగి మరమ్మత్తులు చేయాల్సి ఉన్నప్పటీకీ పలు వార్డుల్లో కనీసం మరమ్మతులు చేయ కుండానే నిర్లక్ష్యంగా వదిలివేశారు. మునిసిపాలిటి వేసిన ర హదారులు మిషన్‌భగీరధ పైపులైన్‌ల కోసం విచ్చలవిడిగా తవ్వేస్తున్నప్పటీకీ సంబందిత అధికారులు మాత్రం స్పం దించడం లేదని ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. మంచి నీటి పైపులైన్‌ పనులకోసం విచ్చలవిడిగా తవ్వకాలు చేసిన అధికారులు, కాంట్రాక్టర్‌ అపై రోడ్డును ఎక్కడిక్కడే వదిలివేస్తున్నారు. పట్టణంలోని అన్నివార్డుల్లో రహదారుల తవ్వకాలు చేసిపైపులైన్‌ పనుల కోసం గుంతలు తీసు ్తన్నారు.. అనంతరం పైపులైన్‌ వేయకుండానే వదిలివేయడం పరిపాటిగా మారింది. ఇటీవల పట్టణంలోని బస్టాండ్‌ మూలమలుపు నుంచి గోవింద్‌సెంటర్‌ సగ  భాగం వరకు జేసీబీతో రోడ్డును ధ్వంసం చేసిన అనంతరం మరుసటిరోజే మళ్లీ జెసీబీతోనే పైపులైన్‌ వేయకుండానే పూడ్చివేశారు. కొంతబాగం పూడ్చివేసి మరికొంతభాగం పూడ్చకుండానే  సీసీ రహదారిని నిర్లక్ష్యంగా వదిలివేశారు. రహదారిని తవ్వ డంతోపాటు నిర్లక్యంగా పూడ్చకుండానే వదిలివేయడంతో అసలు పైపులైన్‌ వేయకుండా తవ్వకాలు ఎందుకు చేశారని స్ధానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లెందు పట్టణంలో మిషన్‌భగీరధ పైపు లైన్‌ కోసం మూడు  నెలలుగా ఇదే తంతుగా పనులు చేస్తున్నప్పటికీ అధికా రులు పట్టించుకోవడం లేదని పలువురు ప్ర జాప్రతినిధులు  తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-07-09T04:55:50+05:30 IST