వ్యవసాయ మార్కెట్‌ సమస్యల వలయం

ABN , First Publish Date - 2021-02-06T03:52:45+05:30 IST

మూడు జిల్లాల పరిధి... మూడు శా సనసభ నియోజకవర్గాల ప్రాతినిధ్యం... ఎనిమిది మండ లాలతో ముడిపడిన ఇల్లెందు వ్యవసాయమార్కెట్‌ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.

వ్యవసాయ మార్కెట్‌ సమస్యల వలయం
ఇల్లెందు వ్యవసాయ మార్కెట్‌

ఇల్లెందు, ఫిబ్రవరి 5: మూడు జిల్లాల పరిధి... మూడు శా సనసభ నియోజకవర్గాల ప్రాతినిధ్యం... ఎనిమిది మండ లాలతో ముడిపడిన ఇల్లెందు వ్యవసాయమార్కెట్‌ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇల్లెందు  నోట్‌ఫైడ్‌ ఏరియాలో 1975లో వ్యవసాయమార్కెట్‌ను నెలకొల్పారు. ఇల్లెందు, టేకు లపల్లి, కామేపల్లి, సింగరేణి, గార్ల, బయ్యారం, గుండాల, ఆళ్ల పల్లి మండలాల రైతు ప్రయోజనాలు ముడిపడి ఉన్న వ్యవ సాయ మార్కెట్‌లో కొద్ది సంవత్సరాలుగా క్రయవిక్రయాలు సక్రమంగా లేక పర్యవేక్షణ లేకపోవడంతో మార్కెట్‌ అలంకార ప్రాయంగా మారింది. ట్రేడర్లు మార్కెట్‌యార్డుకు వచ్చి కొను గోళ్లు జరపకుండా తమ వర్తక వ్యాపార సంస్ధల వద్దనే కొను గోళ్లు చేస్తుండటం, తమ ఇష్టం వచ్చిన రేట్లు చెల్లిస్తుండటంతో ఏజెన్సీ గ్రామాల రైతులు ఆర్ధికంగా నష్టాలకు గురయ్యారు.


మార్కెట్‌ యార్డులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన హమాలీల వివాదాలు, ట్రేడర్లను  రప్పించి మార్కెట్‌ యార్డులోనే క్రయవి క్రయాలు జరిపించడం, గ్రామీణ రైతాంగాన్ని తమ పంటలు మార్కెట్‌లోనే అమ్మకాలు జరుపుకునేందుకు రప్పించడం, టే కులపల్లి, కామేపల్లి, బయ్యారం లాంటి పొరుగు జిల్లాల సరి హద్దు మండలాల రైతులు తమ సమీపంలోని ఇతర జిల్లాల మార్కెట్‌లకు పండించిన పంటలు తరలించి విక్రయాలు జరపడం లాంటి సమస్యలే గాక సిబ్బంది ఖాళీలు, మండలా ల్లోని సబ్‌యార్డుల ద్వారా క్రయవిక్రయాలు జరిపించడం లాంటివి పాలకవర్గం ముందు పెను సమస్యలుగా మారాయి. 


వనరులు ఫుల్‌.. నిర్వహణే నిల్‌..

ఇల్లెందు వ్యవసాయమార్కెట్‌కు ఇల్లెందులో ఆరు ఏకరాల విస్తీర్ణం గల మెయిన్‌యార్డుతోపాటు టేకులపల్లిలో 3.32 ఎక రాల విస్తీర్ణంలో, గార్లలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, బయ్యా రంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో, గుండాలలో ఎకరం విస్తీర్ణం లో గోదాములు విశ్రాంతి భవనాలు, ఓపెన్‌ ప్లాట్‌ఫారాలు ఇతర కొనుగోళ్ల సామగ్రి ఉంది.


అంతేగాక నాబార్డు ఆధ్వర్యం లో టేకులపల్లి మండలం, బద్దుతండాలో, కామేపల్లి మండలం, ముచ్చర్ల గ్రామంలో, సింగరేణి మండలం, అప్పాయిగూడెంలో, గుండాల మండలం మర్కోడు గ్రామంలో ఇల్లెందు మార్కెట్‌కు అనుబందంగా గోదాములు నిర్మించారు. ఇల్లెందు మార్కెట్‌ ప రిధిలోని ఎనిమిది మండలాల్లో 28,500 మెట్రిక్‌ టన్నుల నిల్వ ల సామర్ధ్యాలు గల గోదాములు నిర్మించబడి ఉండటం గమ నార్హం. అయితే అన్ని ఉన్న అల్లుడినోట్లో శని ఉన్న చందంగా వ్యవసాయమార్కెట్‌కు స్ధిర ఆస్థులు, గోదాములు లాంటి వన రులు బారీగా ఉన్నప్పటీకీ ఆదరణ ఆజామయిషీ నిర్వహణ సామర్ధ్యాలు సక్రమంగా లేక అనేక ఏండ్లపాటు ఏజన్సీ చట్టాల అంక్షలతో మార్కెట్‌ కమీటిల నియమకాలు జాప్యం జరగడం వలన ఇల్లెందు మార్కెట్‌ ప్రాభవం కోల్పోయింది. 


ఆదాయం తగ్గింది... ఆదరణ కరువైంది...

వ్యవసాయమార్కెట్‌కు గత దశాబ్దకాలంగా ఆదాయం ఆదరణ తగ్గిందనడం అతిశయోక్తికాదు. గడిచిన ఐదేళ్ల కాలం లో చెక్‌పోస్టులు క్రయవిక్రయాల ద్వారా భారీగానే ఆదాయం సమకూరినప్పటీకీ సిబ్బంది జీతాభత్యాలు, నిర్వహణ వ్యయాలు సైతం భారీగానే పెరిగాయి. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్‌ను సమగ్రాభివృద్ధి చేయాలన్న పట్టుదలతో ఉన్నామ ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బానోత్‌ హరిసింగ్‌ నాయక్‌ తెలి పారు. యార్డులోనే క్రయవిక్రయాలు ప్రారంభించామని, ట్రేడర్లు మార్కెట్‌లోనే కొనుగోళ్లు జరపాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. కొద్దిరోజులుగా ప్రారంభమైన కొనుగోళ్లు రైతులకు లాభసాటిగా ఉన్నాయని పేర్కొన్నారు. 


Updated Date - 2021-02-06T03:52:45+05:30 IST