మహిళా ప్రాంగణం.. ఉపాధికి మార్గం
ABN , First Publish Date - 2021-10-27T05:35:39+05:30 IST
దుర్గాబాయి పేరులో ఉన్న గొప్పదనాన్ని, ధైర్యాన్ని మహిళలలకు అందిస్తూ వారి కాళ్లపై వారు నిలబడేలా తీర్చిదిద్దుతోంది ఖమ్మం నగరం టేకులపల్లిలోని మహిళా ప్రాంగణం. నాలుగెకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మహిళలకు వేసవిలో అనేక రకాల కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చా
శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఉపాధితో పాటు ఆత్మవిశ్వాసం పెంపునకు కృషి
ఖమ్మం ఖానాపురం హవేలీ, అక్టోబరు 26: దుర్గాబాయి పేరులో ఉన్న గొప్పదనాన్ని, ధైర్యాన్ని మహిళలలకు అందిస్తూ వారి కాళ్లపై వారు నిలబడేలా తీర్చిదిద్దుతోంది ఖమ్మం నగరం టేకులపల్లిలోని మహిళా ప్రాంగణం. నాలుగెకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మహిళలకు వేసవిలో అనేక రకాల కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని మహిళా ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత తెలిపారు.
కోర్సుల వివరాలు..
స్పోకెన ఇంగ్లీష్, టైపింగ్, ట్యాలీ, అకౌంటింగ్, కంప్యూటర్, డీసీఏ, డీటీపీ, డ్రైవింగ్, బ్యుటీషియన, మగ్గం వర్క్క్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మారుతున్న సాంకేతికతకు అనుకూలంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో ఈ వేసవిలో నిరుద్యోగ యువత, మహిళలకు నూతన కోర్సుల్లో శిక్షణనిచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు రెసిడెన్షియల్ కోర్సులకే పరమితమమైన మహిళా ప్రాంగణంలో నాన రెసిడెన్షియన కోర్సుల్లో శిక్షణనివ్వనున్నారు. కోర్సులో చేరిన వారిని రెండు బ్యాచలుగా చేసి శిక్షణనివ్వనున్నారు.
18నెలల తర్వాత తిరిగి శిక్షణ..
కరోనా వ్యాప్తి కారణంగా 18నెలలుగా ప్రాంగణంలో శిక్షణలు తాత్కాలికంగా నిలిపివేయగా.. ప్రస్తుతం పరిస్థితులు కాస్త కుదుటపడటంతో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తిరిగి శిక్షణ ప్రారంభించనున్నారు. అన్ని కులాల వారికి టైలరింగ్, క ంప్యూటర్, బ్యూటీషియన కోర్సుల్లో మూడు నెలల కాల వ్యవధి శిక్షణ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్హత ఉన్న వారు 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ, విద్యార్హత కాపీలతో దరఖాస్తులను నేరుగా మహిళా ప్రాంగణం క కార్యాలయంలో అందజేయాలి.
సెల్ప్ డిఫెన్సలో శిక్షణ..
మహిళలకు, ఆడపిల్లలకు ఎటువంటి సంఘనలు జరగకుండా తమను తాము కాపాడుకోవడంలో మహిళా ప్రాంగణం ఆధ్వర్యంలో సెల్ప్‌డిఫెన్సలో వేలాది మందికి శిక్షణ ఇచ్చారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వారికి ఆత్మరక్షణకు శిక్షణ ఇప్పిస్తున్నారు. సమాజంలో మహిళలు తామేమీ తక్కువ కాదని, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి నిపుణులతో కౌన్సెలింగ్, వ్యక్తిత్వ వికాస నిపునుణులో మహిళా సాధికారత దిశగా అడుగులు వేయడానికి మహిళా ప్రాంగణం తోడ్పడుతోంది.
- స్వయం ఉపాధితోపాటు పోటీపరీక్షలకు శిక్షణ
వేల్పుల విజేత, మహిళా ప్రాంగణం అధికారి, ఖమ్మం
మహిళలకు కేవలం ఉపాధి కల్పనలోనే కాకుండా వివిధ పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి కూడా శిక్షణ ఇస్తున్నాం. దానిలో భాగంగానే దాదాపు 323 మంది ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చాం. దానిలో 258 మంది ఉత్తీర్ణత సాధించారు. అదే శిక్షణతో మరికొందరు పంచాయతీ కార్యదర్శుఉల,గా జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా , వీఆర్‌వోలుగా ఉద్యోగాలు సాధించారు. నేటి సమాజంలో పోటీ ప్రపంచానికి దీటుగా ప్రతీ మహిళకు శిక్షణ అందించి జీవనోపాధి పొందే విధంగా మహిళా ప్రాంగణం ద్వారా పూర్తి భరోసా లభిస్తుంది.