మహిళలే అధికం

ABN , First Publish Date - 2021-11-26T06:07:32+05:30 IST

మహిళలే అధికం

మహిళలే అధికం

ఉమ్మడి జిల్లాలో 454 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు

అత్యధికంగా ఖమ్మం డివిజన్‌లో..

ఖమ్మం కలెక్టరేట్‌, నవంబరు 25: ఆకాశంలో సగం.. అన్నింట్లో సగం కావాలనే మహిళలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లోనూ సగభాగానికంటే ఎక్కువగానే  మహిళా ఓటర్లే ఉండడం గమనార్హం. ఇటీవలె జిల్లా ఎన్నికల అధికారులు విడుదల చేసిన స్థానిక సంస్థల శాసనమండలి ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లా లో 768 మంది ఓటర్లు ఉన్నా రు. వీరిలో మహిళలు 454 మంది పురు షులు 314 మంది ఉన్నారు. జిల్లాలో నాలుగు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరిలో నాలుగు డివిజన్ల వారీగా పరిశీలిస్తే ఖమ్మం డివిజన్‌లో మొత్తం 348 మంది ఓటర్లు ఉండగా వీరిలో 205మంది మహిళా ఓటర్లు, 143 మంది పురుషులున్నారు. కల్లూరు డివిజన్‌లో ఒత్తం ఓటర్లు 115 మందిలో 64 మంది మహిళా ఓటర్లు, 51 మంది పు రుషులు ఉన్నారు. కొత్తగూడెం డివిజన్‌లో  221 మందిలో 135మహిళా ఓటర్లు, 86 మంది పురుషులున్నారు. భద్రాచలం డివిజన్‌లో 84 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళా ఓటర్లు 50, పురుష ఓటర్లు 34 ఉన్నారు. ఖమ్మం ఆర్డీవో కార్యాలయం, కల్లూరు ఆర్డీవో కార్యా లయం, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం, భద్రాచలం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఎమ్మెల్సీ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ఓటర్లను కాపాడుకునేందుకు..

శాసన మండలి స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎన్నికల్లో ఎవరికి వారు తమ ఓటర ్లను కాపాడుకునేందకు అభ్యర్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల యినప్పటి నుంచే ప్రత్యేక శిబిరాలకు తరలించి ప్రత్యర్థి శిబిరాలకు గాలం వేసే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తయి పరిశీలన కార్యక్రమం కూడా పూర్తయ్యింది. నేటితో బుజ్జగింపుల పర్వంకూడా పూర్తికానుంది. జిల్లాలో నలుగురు అభ్యర్థులు బరి లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తటస్థులను తమ వైపు తిప్పుకునేందుకు తమ అ నుం గులను వారి బంధువులతో రాయబేరాలు కొనసాగిస్తు న్నారు. జిల్లాలో ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోటీ అనివార్యం కానుందని భా విస్తు న్నారు. అయితే టీఆ ర్‌ఎస్‌ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గోవా శిబిరానికి తరలించనుండగా, కాం గ్రెస్‌ పార్టీ నాయకులు వారి ఓటర్ల ను శిబిరాలకు తరలింపులో నిమ గ్నం అయి నట్లు సమాచారం. స్వతంత్య్ర అభ్యర్థులు మాత్రం అధి కారపార్టీ నేతల ఫోన్లకు కూడా దొరక్కుండా వెళ్లినట్లు ప్రచారం.

Updated Date - 2021-11-26T06:07:32+05:30 IST