బాధిత కుటుంబానికి రేగా పరామర్శ
ABN , First Publish Date - 2021-07-25T04:16:59+05:30 IST
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చుంచు పల్లి మండలంలో నేల కూలిన ఇంటిని ప్రభు త్వ విప్ రేగా కాంతా రావు శనివారం సందర్శించారు.

చుంచుపల్లి, జూలై 24: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చుంచు పల్లి మండలంలో నేల కూలిన ఇంటిని ప్రభు త్వ విప్ రేగా కాంతా రావు శనివారం సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆ బాధితురాలు లక్ష్మీ నుంచి వివరాలు తెలుసుకొని తక్షణ సహాయంగా రేగా విష్ణు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.లక్ష చెక్కును బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.... తీవ్రంగా కురిసిన వర్షానికి నేలమట్టమైన ఇంటిని తక్షణమే మర మ్మతు చేయించేందుకు తనకు తోచిన సహాయాన్ని ట్రస్టు ద్వారా అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి తహసీల్దార్ నాగరాజు, సిబ్బంది శైలజా, ఉమా, టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.