ఖమ్మం జడ్పీ సీఈవోగా వింజం

ABN , First Publish Date - 2021-08-11T05:10:49+05:30 IST

ఖమ్మం జిల్లా పరిషత పరిపాలనాధికారిగా వింజం వెంకట అప్పారావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ

ఖమ్మం జడ్పీ సీఈవోగా వింజం

నేడో రేపో బాధ్యతలు స్వీకరించనున్న వెంకట అప్పారావు

ఖమ్మం కలెక్టరేట్‌, ఆగస్టు 10: ఖమ్మం జిల్లా పరిషత పరిపాలనాధికారిగా వింజం వెంకట అప్పారావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సీఈవోగా పనిచేసిన ప్రియాంక గత నెలలో కరీంనగర్‌కు బదిలీ కావడంతో ఇనచార్జ్‌ సీఈవోగా జిల్లా ఉపాధికల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ స్థానంలో పూర్తిస్థాయి సీఈవోగా అప్పారావును నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన నేడో, రేపో బాధ్యతలను స్వీకరించనున్నారు. జడ్పీ సీఈవోగా నియమితులైన వింజం వెంకట అప్పారావు గతంలో జడ్పీ ఏవోగా సమర్థవంతంగా విధులు నిర్వహించిన ఆయన జడ్పీ డిప్యూటీ సీఈవోగా రెండేళ్లు పనిచేశారు. ఆ తర్వాత గత ఏప్రిల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పర్యవేక్షకుల పదోన్నతులు సమయంలో అప్పారావుకు సీఈవోగా ఉద్యోగోన్నతి వచ్చి మహాబూబాబాద్‌కు నియమితులయ్యారు. ఐదు నెలలు తిరక్కుండానే ఖమ్మం జడ్పీ సీఈవోగా నియమితులయ్యారు. ఆయన నియామకం పట్ల పంచాయతీరాజ్‌ అధికారులు, జడ్పీ కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-08-11T05:10:49+05:30 IST