మేమున్నాం.. ధైర్యంగా ఉండండి
ABN , First Publish Date - 2021-09-04T04:51:03+05:30 IST
మండల పరిధిలోని తనికెళ్ల గ్రామానికి చెందిన జెర్రిపోతుల సంధ్య, మహంత్, జెర్రిపోతుల పుల్లారావు రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే.

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి కలెక్టర్ దంపతుల పరామర్శ
కొనిజర్ల సెప్టెంబరు3: మండల పరిధిలోని తనికెళ్ల గ్రామానికి చెందిన జెర్రిపోతుల సంధ్య, మహంత్, జెర్రిపోతుల పుల్లారావు రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబ సభ్యులను శుక్రవారం కలెక్టర్ గౌతమ్ సతీమణి గౌతమి పరామర్శించారు. జెర్రిపోతుల నాగరాజు కలెక్టర్ వద్ద గన్‌మెన్‌గా పని చేస్తుండటంతో ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. నాగరాజు తమ్ముడి భార్య పద్మను కూడా ఓదార్చారు. పిల్లల కోసం ధైర్యంగా ఉండాలని మనోధైర్యం నింపారు. వీరితో పాటు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనెని సాంబశివరావు పరామర్శించారు.