పల్లెల అభివృద్ధే లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-09T03:48:25+05:30 IST

పల్లెల అభివృద్ధే లక్ష్యం

పల్లెల అభివృద్ధే లక్ష్యం
ఆరెకోడు గ్రామంలో వైకుంఠధామాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అజయ్‌కుమార్‌

అర్హులైన పేదలందరికి సొంతజాగాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు

పల్లెప్రగతి కార్యక్రమాల్లో మంత్రి పువ్వాడ అజయ్‌ 

ఖమ్మం రూరల్‌, రఘునాథపాలెం మండలాల్లో పర్యటన 

ఖమ్మం రూరల్‌/రఘునాథపాలెం, జూలై 8: పల్లెల అభివృద్ధే పల్లెప్రగతి లక్ష్యమని, ఈ కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని, అర్హులైన పేదలకు సొంతజాగాలో డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు నిర్మిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొ న్నారు. గురువారం ఆయన ఖమ్మంరూరల్‌, రఘునాథ పాలెం మండలాల్లో పర్యటించారు. ఖమ్మం రూరల్‌ మండ లం ఆరెకోడు గ్రామంలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాలేరు ఎమ్మేల్యే కందాళ ఉపేందర్‌ రెడ్డితో కలిసి వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాన్ని ప్రారం భించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గతంలో గ్రామాలు చెత్తకుప్పలు, మురుగునీటితో అపరిశుభ్రంగా ఉండేవని, దాంతో ప్రజలు అంటువ్యాధుల బారిన పడి ఆసుపత్రుల పాలయ్యేవార న్నారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నేతృత్వంలో నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాలతో మురుగు తొలగి పోయి.. పచ్చదనంతో కళకళలాడుతూ.. సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయిందన్నారు. పల్లెప్రగతితో గ్రామా లను పరిశుభ్రంగా తీర్చీదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయమని పేర్కొన్న ఆయన.. జిల్లాలో అన్ని గ్రామాలను పల్లెప్రకృతి పనులతో పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని, అలసత్వం వహించొద్దని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, ‘సుడా’ చైర్మన్‌ బట్టు విజయ్‌కుమార్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఖమ్మం రూరల్‌ ఎంపీపీ బెల్లం ఉమా, సర్పంచ్‌ వెంకటనారాయణ, జడ్పీటీసీ సభ్యుడు వరప్రసాద్‌, తది తరులు పాల్గొన్నారు. 

రఘునాథపాలెం మండల కేంద్రంలో మెగాహరితహార కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి 31లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ సొంతజాగాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ భూములు కొన్ని గ్రామాల్లో లేనందున సొంతజాగాలో ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. నూతనం ఎర్పడిన రఘునాథపాలెం అభివృద్ది గురించి రాష్ట్ర వ్యాప్తంగ చర్చసాగుతోందన్నారు. విత్తనశుద్ధి కర్మాగారం, విత్తననాణ్యతా పరీక్ష కేంద్రం, వేర్‌ హౌస్‌ ద్వారా 20లక్షల టన్నులు నిల్వ చేసే గోడైన్లు, రైతువేదికలు, భూ సార పరీక్షకేంద్రం, 150 ఎకరాల్లో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ యూనిట్‌లో ఇప్పటికే 16మంది రైస్‌ మిల్లులకు, 35మంది ఇతర పరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. దీంతో రఘునాథపాలెం అగ్రిహాబ్‌గానే కాకుండ పారిశ్రామిక మండలంగా రూపాంతరం చెందనుందన్నారు. తనస్వంత నిధులైన రూ.5కోట్లను ప్రతి ఏడాది ఒక్క రఘునాథపాలెం మండలానికే కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఆయనవెంట ఎమ్మెల్సీ బాలసాని, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, ‘సుడా’ చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, సర్పంచ్‌ గుడిపుడి శారద, అడిషనల్‌ కలెక్టర్‌ స్నేహలత, ఎంపీపీ భూక్యా గౌరి, వైస్‌ ఎంపీపీ గుత్తా రవికుమార్‌, జడ్పీటిసి మాళోత్‌ ప్రియాంక, ఎంపీటిసి మద్దినేని రజిని, ఉపసర్పంచ్‌ కుందేసాహెబ్‌, గుడిపుడి రామారావు, మందడపు సుధాకర్‌, కుర్రా భాస్కర్‌, మందడపు నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-09T03:48:25+05:30 IST