కామెడీతో కాలక్షేపం!

ABN , First Publish Date - 2021-10-14T06:16:19+05:30 IST

కామెడీతో కాలక్షేపం!

కామెడీతో కాలక్షేపం!
కార్యాలయంలోని కంప్యూటర్‌లో వీడియోలు చేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఉద్యోగులు

డీఆర్‌డీఏ కార్యాలయంలో ఉద్యోగుల నిర్వాకం

సర్వర్‌పై అధిక లోడ్‌తో మొరాయిస్తున్న కంప్యూటర్లు

ఖమ్మం సంక్షేమవిభాగం, అక్టోబరు 13: ప్రజలకు సకాలం లో సత్వర సేవలందించేందుకు సమకూర్చిన సాంకేతిక పరి కరాలు దుర్వినియోగమవుతున్నాయి. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లలో కార్యాలయ పనులు చేయా ల్సిందిన సిబ్బంది ఆన్‌లైన్‌లో కామెడీ షోలు వీక్షిస్తూ, వీడియో గేమ్‌లు ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని డీఆర్‌డీఏ కార్యాలయం కామెడీ షోలకు అడ్డాగా మారిందనే అపవాదును మూటగట్టుకుంది. కార్యాలయ ప్రధాన అధికారి ఉండగానే.. కంప్యూటర్‌ ఉద్యోగులు ఏంచక్కా కామెడీ వీడియో లు వీక్షిస్తున్నారు. పెద్దగా నవ్వుతూ జోష్‌గా కాలక్షేపం చేశారు. 

కార్యాలయ పనివేళలో..

జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయంలో కొందరుసిబ్బం ది పనివేళల్లో సమయాన్ని వృథా చేస్తున్నారు. బుధవారం ఖమ్మం డీఆర్‌డీఏలో డీఆర్‌డీవో విద్యాచందన డీపీఎంల పనితీరుపై సమీక్షిస్తున్నారు. అదే సమయంలో డీఆర్‌డీవో కా ర్యాలయానికి ఎదురుగా ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ గది నుంచి పెద్దగా నవ్వులు వినిపించాయి. దీంతో ఏం జరిగిందని కార్యాలయంలోని ఉద్యోగులతో పాటుగా ‘ఆంధ్రజ్యోతి’ వెళ్లి కంప్యూటర్‌చూడగా యూట్యూబ్‌లో కామెడిషోను కంప్యూటర్‌ ఆపరేటర్‌ వీక్షిస్తున్నారు. అదే సమ యంలో మరి కొంతమంది ఉద్యోగులు పక్కన ఉండి నవ్వుతూ ఎంజాయ్‌ చేశారు. 

నెట్‌ అన్‌లాక్‌

డీఆర్‌డీఏ కార్యాలయంలో డ్వామా, సెర్ప్‌, ఇతర విభాగా లకు విడిగా కంప్యూటర్‌లను కేటాయించారు. అయితే గతంలో కూడా ఇటువంటి విమర్శలు రావటంతో డీఆర్‌డీఏ సర్వర్‌ ఆన్‌ లైన్‌కు వీడియోలు రాకుండా కేవలం కార్యాలయానికి కావా ల్సిన ఆన్‌లైన్‌ విషయాలు వచ్చేలా లాక్‌ చేశారు. కాని కొంత మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు సాంకేతిక విజ్ఞానం విని యోగించి వాటిని అన్‌లాక్‌ చేశారు. దీంతో పనిచేసే సమ యంలోనూ కొంతమంది కంప్యూటర్‌ కామెడీ షోలతో ఎంజాయ్‌ చేస్తున్నారని విమర్శలు వెలువడుతున్నాయి.

ఇటు ఎంజాయ్‌.. అటు సర్వర్‌ సమస్యలు

డీఆర్‌డీఏలో ఒక వైపు డ్వామా కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఆన్‌లైన్‌ నెట్‌ సామర్ధ్యం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు సెర్ప్‌ విభాగంలోని కొంతమంది ఇలా వీడియో వీక్షణాలతో కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలు వెలువడ్డాయి.

విచారణ చేసిన డీఆర్‌డీవో

కాగా కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌తో పాటుగా మరికొంతమంది ఉద్యోగులు కామెడీ షోలుచూస్తూ ఎంజాయ్‌ చేసే విషయం డీఆర్‌డీవో విద్యాచందనకు తెలియటంతో ఆమె విచారణ ప్రారంభించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిం చిన ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2021-10-14T06:16:19+05:30 IST