కరోనా బాధితులు బయట తిరగకుండా చూడాలి
ABN , First Publish Date - 2021-07-09T05:02:18+05:30 IST
కరోనా పాజిటివ్ వచ్చిన వారు బయట తిరగకుండా చర్యలు తీసుకోవాలని, తద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చని జిల్లా వైద్య, అరోగ్యాధికారి డాక్టర్ మాలతి అన్నారు.

అవసరమైతే ఖమ్మం ఐసోలేషన్‌కు పంపండి
జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డాక్టర్ మాలతి
నేలకొండపల్లి, జులై8: కరోనా పాజిటివ్ వచ్చిన వారు బయట తిరగకుండా చర్యలు తీసుకోవాలని, తద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చని జిల్లా వైద్య, అరోగ్యాధికారి డాక్టర్ మాలతి అన్నారు. ఆరెగూడెంలో 10 రోజుల పాటు లాక్‌డౌన్, కరోనా నియంత్రణకు గ్రామపంచాయతీ నిర్ణయం శీర్షికన గురువారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. బోదులబండ వైద్యాధికారి డాక్టర్ శంకర్‌తో కలిసి జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డాక్టర్ మాలతి గురువారం ఆరెగూడెం గ్రామాన్ని సందర్శించారు. గ్రామాన్ని పరిశీలించిన అనం తరం, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, కార్యదర్శిలతో మాట్లాడారు. మాస్కులు లేకుండా ఎవ్వరూ బయటకు రాకుండా చూడాలన్నారు. గ్రామం మొత్తాన్ని శానిటైజ్ చేయాలన్నారు. గురువారం నాలుగు పాజిటివ్ కేసులు వచ్చాయని డాక్టర్ శంకర్ డీఎంఅండ్‌హెచ్‌ఓకు తెలిపారు. ప్రస్తుతం 31 వరకు యాక్టివ్ కేసులున్నట్లు చెప్పారు. కొంచెం ఇబ్బందిగా ఉన్నవారిని జల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాలకు పంపాలని, మామూలుగా ఉన్న వారు, ఇళ్ళల్లో అవకాశం లేనివారు అంగీకరిస్తే ఖమ్మం శారదా ఐసోలేషన్ కేంద్రానికి తరలించాలని మాలతి సూచించారు. ఈ సమావేశంలో సర్పంచ్ దొనకొండ రామకృష్ణ, కార్యర్శి కట్టెకోల రామారావు, ఆశాలు పాల్గొన్నారు.