టీఆర్‌ఎస్ కూసుమంచి మండల అధ్యక్షుడిగా వీరయ్య
ABN , First Publish Date - 2021-11-29T04:53:00+05:30 IST
మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా పెరికశింగారం గ్రామానికి చెందిన వేముల వీరయ్య నియమితులయ్యారు.

కూసుమంచి, నవంబరు 28: మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా పెరికశింగారం గ్రామానికి చెందిన వేముల వీరయ్య నియమితులయ్యారు. ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల కమిటీలు, అనుబంధకమిటీలను ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ప్రకటించారు. మండల పార్టీ అధ్యక్షునిగా వేముల వీరయ్య, ప్రధానకార్యదర్శిగా ఆసీఫ్‌పాష, ఉపాధ్యక్షుడిగా కొండపర్తి సురేష్, బాదావత్ రవి, ఉడుగు వెంకటేశ్వర్లు, అధికారప్రతినిధిగ వాసంశెట్టి వెంకటేశ్వర్లు, కార్యవర్గసభ్యులుగా కందు వెంకన్న, అద్దంకి ఉపేంద్రాచారి, జాగర్లమూడి వెంకటేశ్వర్లు, బాణోతు మంగ్యతో పాటు పలువురిని నియమించారు. వాస్తవానికి కమిటీని నెలరోజులక్రితమే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, పార్టీలో ఆధిపత్యపోరు కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో ఆదివారం కమిటీలను అధికారికంగా ప్రకటించారు.