వరములివ్వు వరలక్ష్మి

ABN , First Publish Date - 2021-08-21T05:23:34+05:30 IST

శ్రావ ణ మాస వరలక్ష్మీవ్రత వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు.

వరములివ్వు వరలక్ష్మి
గుండాల రామాలయంలో వరలక్ష్మి పూజలు చేస్తున్న మహిళలు

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు

కొవిడ్‌ నేపథ్యంలో ఇంట్లోనే వేడుకలు

వాయినాలు ఇచ్చిపుచ్చుకున్న మహిళలు

అశ్వారావుపేట/ అశ్వారావుపేట రూరల్‌/ మణుగూరు/ గుండాల/ దమ్మపేట/ చండ్రుగొండ భద్రాచలం/ కర కగూడెం, ఆగస్టు 20: శ్రావ ణ మాస వరలక్ష్మీవ్రత వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్లలో పం డుగ వాతావరణం నెలకొంది. కరోనా నేపఽథ్యంలో మహిళలు ఆలయాలకు వెళ్లకుండా ఎక్కువగా ఇళ్లలోనే పూజ లు చేసుకున్నారు. అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాలలో వరలక్ష్మీ వ్రత వేడుకలను జరుపుకున్నారు. ఉదయమే మహిళలు నూతన, పట్టు వస్త్రాలు ధరించి అమ్మవారికి వివిధ రకాల ప్రసాదాలు తయారుచేసి పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన లక్ష్మీదేవి రూపులు ఉంచి పూజ లు నిర్వహించా రు. అమ్మవారిని అందంగా అలంకరించి పూజలు జరిపారు. పూజల అనంతరం కలకాలం జీవించాలని కోరుతూ కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. వ్రతం చేసుకు న్న మహిళలు ముత్తాయిదువులకు వాయినాలు ఇచ్చుకున్నారు. 

Updated Date - 2021-08-21T05:23:34+05:30 IST