వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు.. జనవరి 3 నుంచి

ABN , First Publish Date - 2021-11-26T06:11:01+05:30 IST

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు.. జనవరి 3 నుంచి

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు.. జనవరి 3 నుంచి
గోదావరిలో తెప్పోత్సవం (ఫైల్‌)

భద్రాద్రి ఈవోకు వివరాలు అందించిన వైదిక కమిటీ

12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వార దర్శనం

ఈసారి గోదావరిలోనే తెప్పోత్సవం

భద్రాచలం, నవంబరు 25: భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 3నుంచి 23వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. జనవరి 24నుంచి 26వరకు మూడు రోజుల పాటు విలాసోత్సవాలు జరగనున్నాయి. జనవరి 29న స్వామి వారికి విశ్వరూపసేవ నిర్వహించనున్నారు. ఇందుకు సంబందించిన పూరిస్థాయి వివరాలను నివేదిక రూపంలో భద్రాద్రి దేవస్థానం ఈవో బి.శివాజీకి వైదిక కమిటీ సభ్యులు అందజేశారు.  

అధ్యయనోత్సవాలు ఇలా

భద్రాచలంలో ఏటా అధ్యయనోత్సవాలు రెండు విధాలుగా నిర్వహిస్తారు. తొలుత పగల్‌పత్తు, అనంతరం రాపత్తు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. అందులో భాగంగా జనవరి 3న పగల్‌పత్తు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు స్వామివారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 3వ తేదీన మత్సావతారం, 4వ తేదీన కూర్మావతారం, 5న వరాహావతారం, 6న నరసింహావతారం, 7న వామనావతారం, 8న పరశురామా వతారం 9న శ్రీరామవతారం, 10న బలరామావతారం, 11న శ్రీ కృష్ణావతారంలో భక్తులకు దర్శనమివ్వానున్నారు.  

12న తెప్పోత్సవం, 13న వైకుంఠ ద్వార దర్శనం

అధ్యయనోత్సవాల్లో కీలక ఘట్టమైన తెప్పోత్సవం జన వరి 12న సాయంత్రం నిర్వహించనున్నారు. దశాబ్దాలు గా గోదావరిలోనే సీతారామచంద్రస్వామికి తెప్పోత్సవం నిర్వ హిస్తుండగా గతేడాది కరోనా కారణంతో దేవస్థానం అధి కారులు రామాలయ ప్రాంగణంలోని గోశాల పక్కన కృత్రిమ కొలను ఏర్పాటు చేసి నిర్వహించారు. అయితే ఈసారి కరోనా వ్యాప్తి తగ్గడంతో గతంలో మాదిరిగానే గోదావరిలో తెప్పోత్సవం నిర్వహణకు దేవస్థానం వర్గాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి దేవాదాయ శాఖ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ నుంచి అనుమతి రావాల్సి ఉంది. అదేవిధంగా జనవరి 13న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారంలో స్వామి వారు దర్శనమివ్వనున్నారు. అదే రోజు రాత్రి నుంచి స్వామి వారి రాపత్తు సేవలు ప్రారంభ మై జనవరి 23 వరకు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భద్రాచలం పట్టణంలోని వివిధ మండపాల్లో ప్రతి రోజు స్వామివారు భక్తులకు దర్శనమివ్వానున్నారు. అదేవిధంగా 24 నుంచి 26 వరకు విలాసోత్సవాలు జరగనున్నాయి.  

29న విశ్వరూప సేవ 

అధ్యయనోత్సవాల్లో భాగంగా జనవరి 29న విశ్వరూప సేవ రామాలయంలోని బేడా మండపం ఆవరణలో నిర్వ హించనున్నారు. రామాలయంలో ప్రతినిత్యం ఆరాఽధించే దేవతామూర్తులందరినీ ఒక చోట చేర్చి వైదిక సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఎంతో అరుదైన ఈ కార్యక్రమంలో కదంబం అనే ప్రత్యేక ప్రసాదాన్ని స్వామి వారికి నివేదన చేస్తారు.



Updated Date - 2021-11-26T06:11:01+05:30 IST