రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2021-12-29T05:22:19+05:30 IST

పట్టణంలోని షాదీఖానా వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

సత్తుపల్లిరూరల్‌, డిసెంబరు 28 : పట్టణంలోని షాదీఖానా వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేంసూరు మండలం కుంచపర్తికి చెందిన వేముల గోపి, సింగరేణిలో వోల్పో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మందుల కోసం వెంగళరావ్‌నగర్‌లో డిస్పెన్షరీకి బైక్‌పై వెళుతున్నాడు. వేంసూరు మండలం మర్లపాడుకు చెందిన సాధు చందు స్థానిక ఎన్టీఆర్‌ నగర్‌లోని పెద్దమ్మ ఇంటికి బైక్‌ వస్తున్నాడు. ఈక్రమంలో షాదీఖానా వద్ద ఢీకొన్నాయి. వీరిద్దరికి తీవ్రగాలవటంతో ఖమ్మం తరలించారు.

Updated Date - 2021-12-29T05:22:19+05:30 IST