పాలేరు జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2021-10-08T05:26:37+05:30 IST

పాలేరు జలాశయం ఇన్‌పాల్‌ గేట్ల వద్ద రెండు మృతదేహాలు నీటిలో కొట్టుకుని వచ్చాయి. నాయకన్‌గూడెం వద్ద కాల్వలో నీటిలో తేలియాడుతుండగా గ్రామస్ధులు పోలీసులకు సమాచారం అందించారు.

పాలేరు జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యం

కూసుమంచి, అక్టోబరు7: పాలేరు జలాశయం ఇన్‌పాల్‌ గేట్ల వద్ద రెండు మృతదేహాలు నీటిలో కొట్టుకుని వచ్చాయి. నాయకన్‌గూడెం వద్ద కాల్వలో నీటిలో తేలియాడుతుండగా గ్రామస్ధులు పోలీసులకు సమాచారం అందించారు. మత్స్యకారుల సాయంతో మృతదేహాలను బయటకు తీయించారు. మృతదేహాలు నీటికి బాగా ఉబ్బి ఉండటంతో గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. కాగా మృతులు బీహారీలుగా గుర్తించారు. ఈనెల 5న సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వద్ద స్నానానికి వెళ్లి నీటిలో మునిగిపోవడంతో కుటుంబసభ్యులు వెతుకుతూ వచ్చారు. బీహార్‌ రాష్ట్రం తెలహెంబ్రెంకు చెందిన వినోద్‌ముఖియ(40), సునీల్‌హెంబ్రహం(40) గా గుర్తించారు.

Updated Date - 2021-10-08T05:26:37+05:30 IST