టీఎస్పీఎస్సీ సభ్యుడిగా బండి లింగారెడ్డి
ABN , First Publish Date - 2021-05-20T06:23:25+05:30 IST
టీఎస్పీఎస్సీ సభ్యుడిగా బండి లింగారెడ్డి

కందుకూరు వాసికి కమిటీలో దక్కిన చోటు
హర్షం తెలిపిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
వేంసూరు, మే 19: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు సభ్యుడిగా ఖమ్మం జిల్లా వాసి నియమితులయ్యారు. వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన డాక్టర్ బండి లింగారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చింది. టీఎస్పీఎస్సీకి ఏడుగురు సభ్యులను ఎంపిక చేయగా.. వారిలో డాక్టర్ లింగారెడ్డికి చోటు లభించింది. వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో జన్మించిన ఆయన సత్తుపల్లి పట్టణంలోని బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఎంఎస్సీ, పీహెచ్డీ చేసిన ఆయన హైదరాబాద్లోని చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)లో 1996 నుంచి ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఫిజిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నారు. అయితే సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన బండి లింగారెడ్డిని టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించటం పట్ల సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంటకవీరయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లింగారెడ్డికి సండ్ర శుభాకాంక్షలు తెలిపారు.