నిరుద్యోగులకు ఉపాధికల్పనే ప్రధాన లక్ష్యం

ABN , First Publish Date - 2021-02-09T04:39:40+05:30 IST

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిం చడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో పరిశ్రమల అనుమతుల జారీ ఉండాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ సూచించారు.

నిరుద్యోగులకు ఉపాధికల్పనే ప్రధాన లక్ష్యం
మాట్లాడుతున్న కలెక్టర్‌ కర్ణన్‌

టీఎస్‌ ఐపాస్‌ సమీక్షలో కలెక్టర్‌ కర్ణన్‌

ఖమ్మం కలెక్టరేట్‌, ఫిబ్రవరి8: జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిం చడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో పరిశ్రమల అనుమతుల జారీ ఉండాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ సూచించారు. వీటిపై సత ్వర చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సోమవారం సాయంత్రం కలెక్టర్‌ ఛాంబర్‌లో జరిగిన టీఎస్‌ ఐపాస్‌, జిల్లా పరిశ్రమల ప్రమోషన్‌ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జనవరి నెల పురోగతిని కలెక్టర్‌ సమీక్షించారు. జనవరిలో మిగిలిన 11 అనుమతులకోసం సబంధిత శాఖల అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీఎస్‌ ఐపాస్‌ కింద 29 కోట్ల విలువైన పరిశ్రమల స్థాపన ద్వారా సుమారు 200 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. వివిధ పథకాల సబ్సిడీని మంజూరి చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమీషనర్‌ అనురాగ్‌ జయంతి, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ ఏ అజయ్‌కుమార్‌,టీఎస్‌ ఐ పాస్‌ జోనల్‌ మేనేజర్‌ పవన్‌కుమార్‌, జిల్లా సాంఘీక సంక్షేమశాఖాధికారి సత్యనారాయణ, కాలుష్యనియంత్రణ మండలి ఏఈ శంకర్‌, జిల్లా గిరిజనసంక్షేమశాఖ అధికారి కృష్ణానాయక్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-09T04:39:40+05:30 IST