సేవతోనే నిజమైన సంతృప్తి
ABN , First Publish Date - 2021-12-31T05:16:52+05:30 IST
సమాజంలో సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని, సేవతోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని సీఎల్‌పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
మధిర రూరల్, డిసెంబరు 30: సమాజంలో సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని, సేవతోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని సీఎల్‌పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం మధిర మండలం తొండలగోపారం గ్రామంలో పీవీఆర్‌ఎస్ పౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలోని 11 మంది వృద్ధులకు రూ.వెయ్యి పింఛన్‌తోపాటు వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా పౌండేషన్ చైర్మన్ పారుపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. స్వగ్రామంపై మమకారంతో గ్రామంలోని పేదప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో స్థానిక వాసి, పౌండేషన్ చైర్మన్ పారుపల్లి వెంకటేశ్వరరావు గ్రామాభివృద్ధికి కృషి చేయటంతో అభినందనీయమని భట్టి విక్రమార్క కొని యాడారు. అనంతరం గ్రామప్రజలకు శుద్ధమైన నీటిని అందించే వాటర్‌ఫ్లాంట్‌ను భట్టి విక్రమార్క పరిశీలిం చారు. కార్యక్రమంలో దాత పారుపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు సూరంశెట్టి కిషోర్, కర్నాటి రామారావు, తూమాటి నవీన్‌రెడ్డి, అద్దంకి రవికుమార్, చావా వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి సత్యం, పారుపల్లి విజయ్ కుమార్, దారా బాలరాజు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ పగిడిపల్లి సత్యనారాయణ, పాల్గొన్నారు.
పారుపల్లి రాధాకృష్ణకు నివాళి
మధిర మండలం తొండలగోపారంలో ఇటీవల మృతిచెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పారుపల్లి రాధాకృష్ణమూర్తి దశదిన కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించారు.
కార్డన్‌సెర్చ్‌లో పాల్గొన్న ఏసీపీ, సీఐ తదితరులు