నేటినుంచి టీఆర్‌ఎస్‌ నిరసన

ABN , First Publish Date - 2021-12-20T04:49:44+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాగు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమం నిర్వహిస్తోంది. సోమవారం నుంచి మూడురోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపు నిచ్చారు.

నేటినుంచి టీఆర్‌ఎస్‌ నిరసన
కల్లూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సండ్ర

మూడు రోజులు పాటు గ్రామగ్రామాన కార్యక్రమం

 సాగుపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన 

ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య , రాములు నాయక్‌

కల్లూరు,డిసెంబరు19: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాగు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమం నిర్వహిస్తోంది. సోమవారం నుంచి మూడురోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని   సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపు నిచ్చారు. కల్లూరులో ఆదివారం జరిగిన ఆ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న వైఖరికి నిరసనగా సత్తుపల్లి నియోజక వర్గంలోని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం ఉటుందన్నారు. ఫ్లెక్సీలతో పాటుగా నల్లజెండాలు ఎగరవేయటం , కేంద్రప్రభుత్వ  దిష్టి బొమ్మ దహనం ఉంటుందన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియపరిచేలా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.  ఈ సమావేశంలో జెడ్పీటీసీ కట్టా అజయ్‌ కుమార్‌, రైతు బంధు ప్రతినిధులు పసుమర్తి చందర్‌ రావు, డాక్టర్‌ లక్కినేని రఘు, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ కాటంనేని వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్‌ బోబోలు లక్ష్మణరావు, రైతు విభాగం డైరెక్టర్‌ కర్నాటి జయబాబు రెడ్డి, ఆపార్టీ నాయకులు పెద్దబోయిన మల్లేశ్వరరావు, మేకల కృష్ణ, సర్పంచులు గంగవరపు వెంకటేశ్వరరావు, రావి సూర్యనారయణ, ధరావత్‌ మోహన్‌నాయక్‌,నందిగం ప్రసాద్‌ న్యాయవాది పప్పుల రత్నాకర్‌  పాల్గొన్నారు.

వైరా: కేంద్ర ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ చేపడుతున్న నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ పిలుపునిచ్చారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చి కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మార్కెఫెడ్‌ రాష్ట్ర వైస్‌ ఛైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, ఏఎంసీ ఛైర్మన్‌ గుమ్యా రోశయ్య, మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ సూతకాని జైపాల్‌, ముళ్లపాటి సీతరాములు, ఎంపీపీ వేల్పుల పావని, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, దార్నా రాజశేఖర్‌, కొణిజర్ల మండల అధ్యక్షుడు చిరంజీవి, రైతు బంధు మండల అధ్యక్షుడు మిట్టపల్లి నాగి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి

సత్తుపల్లి: రైతులపై కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిప్పింకొట్టేందుకు నేడు నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎంపీపీ దొడ్డా హైమావతి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుమేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నేడు తలపెట్టనున్న నిరసన కార్యక్రమాలకు రైతులతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, ఆత్మ చైర్మన్‌ హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, టీఆర్‌ఎస్‌ పట్టణ, మండల కమిటీ అధ్యక్షులు మోనార్క్‌ రఫీ, యాగంటి శ్రీను, గాదె సత్యం, దొడ్డా శంకరరావు, కొత్తూరు ఉమామహేశ్వరరావు  పాల్గొన్నారు.

 తల్లాడ:ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరి వల్ల తెలంగాణ రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం జరిగే నిరసన కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. ఆదివారం తల్లాడలో బొడ్డు వెంకటేశ్వరరావు గృహంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

వీరయ్యకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

మల్లవరంలో అనారోగ్యంతో మృతిచెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పూనాటి వీరయ్య మృతదేహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ దూపాటి భద్రరాజు, సొసైటీ చైర్మన్‌ అయిలూరి ప్రదీప్‌రెడ్డి, సర్పంచ్‌లు శీలం కోటారెడ్డి, నారపోగు వెంకట్‌, జొన్నలగడ్డ కిరణ్‌బాబు, ఓబుల సీతారామిరెడ్డి, జోన్‌ కన్వీనర్లు బద్దం కోటిరెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కేతినేని చలపతిరావు, జీవీఆర్‌, షేక్‌.యూసూబ్‌, పెరిక నాగేశ్వరరావు, ఉపసర్పంచ్‌లు గుండ్ల వెంకటి, శీలం ముత్తారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-20T04:49:44+05:30 IST