ఓటర్లను ప్రలోభపెడుతున్న టీఆర్‌ఎస్, బీజేపీ
ABN , First Publish Date - 2021-10-29T05:37:18+05:30 IST
హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవడానికి టీఆర్‌ఎస్, బీజేపీ ఓటర్లను ప్రలోభపెడుతోందని సీపీఎం రాష్ట్ర నాయకుడు పొన్న వెంకటేశ్వరరావు ఆరోపించారు.

సీపీఎం రాష్ట్ర నాయకుడు పొన్నం
ఎర్రుపాలెం, అక్టోబరు 28: హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవడానికి టీఆర్‌ఎస్, బీజేపీ ఓటర్లను ప్రలోభపెడుతోందని సీపీఎం రాష్ట్ర నాయకుడు పొన్న వెంకటేశ్వరరావు ఆరోపించారు. లక్షల రూపాయలు వెదజల్లుతున్నాయన్నారు. గురువారం మండల పరిధిలోని బీమవరంలో పార్టీ సభ్యులకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తరగతులకు సీపీఎం మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.కోటేశ్వరరావు హనుమంతరావు, వెంకటేశ్వర్లు,నాగుల్‌మీరా, సంజీవరావు, జోగయ్య, శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి, షేక్‌లాలా, ఎం.తిరుపతిరావు, ఎన్.వెంకటరామయ్య, కె.నాగేశ్వరరావు, అయ్యవారిగూడెం సొసైటీ డైరెక్టర్ శ్రీహరినారాయణ, వెంకటేశ్వరరావు, జాని, తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలను శాసిస్తున్న ధనం మతం: నున్నా
కల్లూరు: నేటి రాజకీయాలను ధనం,మతం శాసిస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. కల్లూరు మండలంలోని ఎర్రబోయినపల్లి గ్రామంలో గురువారం సీపీఎం మండల మహసభ జరిగింది. ఈ మహసభకు తన్నీరు కృష్ణవేణి ,దోమతోటి పుల్లయ్య, మాదల వెంకటేశ్వరరావు, ముదిగొండ అంజయ్య అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటాయని,తిరిగి పార్టీకి పూర్వ వైభవం రాబోతుందన్నారు.ఈ మహసభకు ముందుగా పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు మట్టూరి భద్రయ్య అవిష్కారించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్యిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్రి ప్రసాద్,జిల్లా కార్యవర్గ సభ్యులు మాచర్ల భారతి, కళ్యాణం వెంకటేశ్వరరావు, తాత బాస్కరరావు, ఆపార్టీ నాయకులు పాండు రంగారావు, రాజబాబు, మండల సీపీఎం కార్యదర్శి తన్నీరు కృష్ణర్జునరావు, తదితరులు పాల్గొన్నారు.