టీఆర్‌ఎస్‌ అండదండలతోనే భూ ఆక్రమణలు..

ABN , First Publish Date - 2021-05-09T04:36:13+05:30 IST

మణుగూరు మండలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధుల అండదండలతో కొందరు వ్యక్తులు భూ అక్రమణలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గురిజాల గోపి ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ అండదండలతోనే భూ ఆక్రమణలు..
నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గోపి

మణుగూరుటౌన్‌, మే 8: మణుగూరు మండలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధుల అండదండలతో కొందరు వ్యక్తులు భూ అక్రమణలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గురిజాల గోపి ఆరోపించారు. శనివారం ముత్యాలమ్మనగర్‌ పంచాయతీలోని ప్రభుత్వ ఐటటీఐ కళాశాల వెనుక ప్రాంతంలో ఓ గిరిజనుడికి చెందిన భూమిని ఆక్రమించి చేపడుతున్న పనులను కాంగ్రెస్‌ నేతల బృందం అడ్డుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే నెంబర్‌ 314లో గిరిజనుడి స్వాదీనంలోని భూమిని జడ్పీటీసీ అండదండలతో సర్పంచ్‌ ఆక్రమించి నిర్మాణ పనులు ప్రారంభించారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు పీరినాకి నవీన్‌, కొమరం రామూర్తి, గోళ్ల సాంబయ్య, నూరిద్దీన్‌, షభానా, షరీఫ్‌, ముక్కెర లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T04:36:13+05:30 IST