టౌన్‌ప్లానింగ్‌ మాయ

ABN , First Publish Date - 2021-10-30T04:24:46+05:30 IST

నిర్మాణాల అనుమతి విషయంలో మాయ జరుగుతోంది. ఒక స్థలంలో భవన నిర్మాణ అనుమతిని ఇచ్చిన అధికారులు... పక్కనే ఉన్న స్థలానికి అనుమతులు నిరాకరిస్తున్నారు.

టౌన్‌ప్లానింగ్‌ మాయ
జయనగర్‌ కాలనీలో ఈ భవనానికి అనుమతి ఇచ్చి, పక్క స్థలానికి అనుమతి ఇవ్వటం లేదు

ఖమ్మం కార్పొరేషన్‌, అక్టోబరు29: నిర్మాణాల అనుమతి విషయంలో మాయ జరుగుతోంది. ఒక స్థలంలో భవన నిర్మాణ అనుమతిని ఇచ్చిన అధికారులు... పక్కనే ఉన్న స్థలానికి అనుమతులు నిరాకరిస్తున్నారు. పక్కనే డొంక ఉందంటూ కారణం చెబుతున్నారు. డొంక ఉంటే మరి పక్క స్థలానికి ఎలా అనుమతి ఇచ్చారో అర్ధం కాని పరిస్థితి. ఽప్రస్తుతం ఉన్న మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అనుమతులు ఇస్తున్నామని పేర్కొంటున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పలు అనుమతులకు కొర్రీలు పెడుతున్నారని దరఖాస్తుదారులు చెబుతున్నారు.

కొందరికి సులభంగానే

ఎటువంటి సమస్యలు ఉన్నా కొందరికి సులభంగా నిర్మాణ అనుమతులు లభించటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని నిబంధనలు పాటించినా, ఏదో ఇక ధ్రువపత్రం కావాలని అడుగుతున్నారని, వాటిని ఇచ్చినా మరో ధృవపత్రం అవసరమనిఅంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇక ఖానాపురం, జయనగర్‌ కాలనీ వంటి ప్రాంతాల్లో ఒక చోట అనుమతి ఇచ్చి. పక్కనే అనుమతి ఇవ్వని సంఘటనలు  కోకొల్లలు ఉన్నాయి. ఇక అపార్టుమెంట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే కొందరికి వెంటనే అనుమతి రావటంపై  విమర్శలు ఉన్నాయి. నగరంలోని టేకులపల్లి సాగర్‌కాలువ ప్రాంతం సమీపంలో ఒక వ్యక్తి సొంతస్థలంలో బహుళ అంతస్తుల నిర్మాణం కోనం దరఖాస్తు చేసుకుంటే అనుమతి కోసం టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. అడిగిన అన్ని ధ్రువపత్నాలు ఇచ్చినా... ట్రాఫిక్‌ ఎన్‌వోసీ అంటూ మళ్లీ కొర్రీలు పెట్టడం గమనార్హం. వైరారోడ్‌లో ఇటీవల ఇక భారీ భవన నిర్మాణం జరిగితే ట్రాఫిక్‌ ఎన్‌వోసీలు, ఇతరత్రా ఏమీ లేకుండానే అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. ఇక జయనగర్‌ కాలనీలో తాజాగా ఒక భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చి, పక్క స్థలానికి డొంక ఉందని చెబుతూ అనుమతులు నిరాకరించారు. నిర్మాణ అనుమతుల విషయంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారుల వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్న నేపఽథ్యంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే అనుమతులు పారదర్శకంగా లభిస్తాయనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.

Updated Date - 2021-10-30T04:24:46+05:30 IST