వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-10T04:53:32+05:30 IST

తల్లిదండ్రులు మందలించారని మనస్థాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య

 తల్లిదండ్రులు మందలించారని సత్తుపల్లిలో యువతి  

 కారేపల్లిలో కుటుంబ కలహాలతో  రిటైర్డ్‌ సింగరేణి ఉద్యోగి

 ఇల్లెందులో మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికుడు..

సత్తుపల్లి రూరల్‌, డిసెంబరు 9: తల్లిదండ్రులు మందలించారని మనస్థాపం చెందిన ఓ యువతి   ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బాసారం గ్రామానికి చెందిన కొయ్యల కల్యాణి (19) ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తయ్యాక రెండో సంవత్సరం కళాశాలకు వెళ్లలేదు. దాంతో పత్తిచేలో పనికి రావాలని తల్లిదండ్రులు కోరగా నిరాకరించిన కల్యాణి తీవ్ర మనస్థాపం చెంది గతనెల 20వ తేదీన కలుపు మందు తాగింది. దాంతో ఆమెకు సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతుడి తండ్రి కొయ్యల శ్రీను ఫిర్యాదు మేరకు సత్తుపల్లి ఏఎస్‌ఐ గాదె ప్రతాపరెడ్డి కేసు నమోదు చేశారు.

బావిలో దూకి సింగరేణి విశాంత్ర ఉద్యోగి..

కారేపల్లి: బావిలో దూకి సింగరేణి కాలరీస్‌ విశాంత్ర ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం  వెంకిటీయ్యతండాకు చెందిన వాంకుడోత్‌ గోబ్రియా(65) పెట్రోల్‌ బంకు సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. సమీపంలోని వ్యవసాయభూమిలో దూకి ఆత్మహత్య చుసుకున్నాడు. ఇది గమనించిన సమీపంలోని కొందరు కేకలు వేశారు. కుటుంబసభ్యులకు సమాచారం అందిం చారు. గ్రామస్థుల సహకారంతో మృతదేహన్ని వెలికితీశారు. అయితే ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణమని తెలిసింది. పోలీసులు వచ్చి కేసునమోదు చేశారు. శవాన్ని పోస్టుమార్టం కోరుకు ఇల్లెందు తరలించారు. మృతుడు గోబ్రియకు భార్య , ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

 కాంట్రాక్టు కార్మికుడు..

ఇల్లెందుటౌన్‌: ఇల్లెందు పట్టణంలోని 15వ నెంబర్‌ బస్తీకి చెందిన మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికుడు గురువారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం భద్రయ్య(55) కొంతకాలంగా  మునిసిపాలిటిలోని వాటర్‌ వర్క్స్‌ విభాగంలో పని చేస్తున్నాడు.  కుటుంబంలో తలెత్తిన స్వల్ప వివాదంతో తీవ్ర మనస్ధాపం చెందాడు. ఇంట్లో ఎవరు లేని సయమంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఇల్లెందు పోలీసులు కేసు నమోదు చేశారు.


Updated Date - 2021-12-10T04:53:32+05:30 IST