దళిత, గిరిజనులను దగా చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-08-22T05:04:24+05:30 IST

టీఆర్‌ఎస్‌ ఏడేళ్లపాలనలో దళితులు, గిరిజనులు పూర్తిగ దగాపడ్డారని, కాంగ్రెస్‌ హయాంలోనే ఆయా వర్గాలకు న్యాయం జరిగిందని దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర కోఆర్డినేటర్‌, పీసీసీ నాయకుడు మాసకపల్లి లింగాజీ అన్నారు.

దళిత, గిరిజనులను దగా చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

పీసీసీ నాయకుడు లింగాజీ 

అశ్వారావుపేట, ఆగస్టు 21: టీఆర్‌ఎస్‌ ఏడేళ్లపాలనలో దళితులు, గిరిజనులు పూర్తిగ దగాపడ్డారని, కాంగ్రెస్‌ హయాంలోనే ఆయా వర్గాలకు న్యాయం జరిగిందని దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర కోఆర్డినేటర్‌, పీసీసీ నాయకుడు మాసకపల్లి లింగాజీ అన్నారు. శనివారం పట్టణంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మొగళ్లపు చెన్నకేశవరావు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్‌ ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన లింగాజీ మాట్లాడుతూ హుజూరాబాద్‌లో 70 వేల దళితుల ఓట్లును ఆకర్షించేందుకే దళితబంధును సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టి, మరో సారి దళితులను దగా చేసే కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో 40 రోజుల పాటు దళిత, గిరిజన ఆత్మగౌరవ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడి చేసి ఎమ్మెల్యేలను రాజీనామా చేసి, నియోజకవర్గ అభివృద్ధి సహకరించాలని డిమాండ్‌ చేయనున్నట్టు ఆయన తెలిపారు. సెప్టెంబరు 17వ తేదీన వరంగల్‌లో రాహుల్‌గాంధీ సభను ఏర్పాటు చేసేందుకు పీసీసీ సన్నాహాలు చేస్తుందన్నారు.  రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు సున్నం నాగమణి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మొగళ్లపు చెన్నకేశవరావు, తుమ్మా రాంబాబు, దమ్మపేట అధ్యక్షుడు మద్దిశెట్టి సత్య ప్రసాద్‌, అన్నపురెడ్డిపల్లి అధ్యక్షుడు ప్రసాద్‌, ఎంపీటీసీలు వేముల భారతి, సత్యవరపు తిరుమల, సంగ ప్రసాద్‌, జుజ్జూరు దుర్గారావు, జల్లిపల్లి దేవరాజ్‌, బూసి పాండు, ములకలపల్లి అధ్యక్షుడు తాండ్ర ప్రభాకరరావు, పలు మండలాలనుండి వచ్చిన నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-22T05:04:24+05:30 IST