రెండో వారధిని త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-08-11T05:22:20+05:30 IST

భద్రాచలం వద్ద గోదావరిపై చేపట్టిన రెండో వారధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రమంత్రి నితన్‌ గడ్కరీ ఆదేశించారు.

రెండో వారధిని త్వరగా పూర్తి చేయాలి
సమావేశం నిర్వహిస్తున్న దృశ్యం

 భద్రాచలం బ్రిడ్జి పనులపై ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సమీక్ష 

భద్రాచలం, ఆగస్టు10: భద్రాచలం వద్ద గోదావరిపై చేపట్టిన రెండో వారధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రమంత్రి నితన్‌ గడ్కరీ ఆదేశించారు. ఢిల్లీలో జాతీయ రహదారుల శాఖ కార్యాల యంలో మంగళవారం జరిగిన సమీక్షలో మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవితతో కలిసి అధికారులతో బ్రిడ్జి పనుల ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బిడ్జి నిర్మాణంలో అలసత్వం పట్ల అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగం పెంచాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే శ్రీరామనవమి వరకు వారధి పనులు పూర్తి చేసి రాకపోకలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2021-08-11T05:22:20+05:30 IST