నేరాల నియంత్రణలో కెమెరాల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2021-09-04T04:34:11+05:30 IST

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమైందని కల్లూరు ఏసీపీ ఎన.వెంకటేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం పుల్లయ్యబంజర్‌ గ్రామంలో సర్పంచ పెద్దబోయిన కృష్ణవేణి, పలు

నేరాల నియంత్రణలో కెమెరాల పాత్ర కీలకం

కల్లూరు, సెప్టెంబరు 3: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమైందని కల్లూరు ఏసీపీ ఎన.వెంకటేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం పుల్లయ్యబంజర్‌ గ్రామంలో సర్పంచ పెద్దబోయిన కృష్ణవేణి, పలువురు దాతల సహకారంతో రూ.1.10లక్షల అంచనాతో స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నేరాల రహీత గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గ్రామాల్లో దాతల సహకారంతో నిఘా కెమెరా లను ఏర్పాటుచేయటం జరుగుతుందన్నారు. నేరాలు అదుపు చేసేక్రమంలో పోలీసులు ప్రజలతో మమేకమై ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు తమవంతు కర్తవ్యంగా విధినిర్వహణ నిర్వర్తిస్తున్నామన్నారు. పుల్లయ్యబంజర్‌ గ్రామం లోని ప్రధాన కూడళ్లలో ఏడు ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు అందించిన సహకారం అభినందనీయ మన్నారు. కార్యక్రమంలో పంచాయతీ గౌరవ సలహాదారు పెద్దబోయిన మల్లేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్‌ బోబోలు లక్ష్మణ్‌రావు, గ్రామ రైతుబంధు కోఆర్డినేటర్‌ పెద్దబోయిన నారాయణ రావు, వైస్‌ఎంపీపీ బుర్రి భవానీ నర్సింహారావు, స్థానికుడు సాయిన్ని రామారావు, ఎస్‌ఐ రఫీ, కానిస్టేబుళ్లు ప్రకాష్‌, ఎం.రంగారావు, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-04T04:34:11+05:30 IST