అవనిని అభినందించిన టీఆర్‌ఎస్‌ లోకసభాపక్ష నేత నామ

ABN , First Publish Date - 2021-09-04T05:02:25+05:30 IST

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన అవని లేఖరాను టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరావు అభినంద నలు తెలిపారు.

అవనిని అభినందించిన టీఆర్‌ఎస్‌ లోకసభాపక్ష నేత నామ

 ఖమ్మంచర్చికాంపౌండ్‌, సెప్టెంబరు3: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన అవని లేఖరాను టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరావు అభినంద నలు తెలిపారు. పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అవనిని అభినందనలు తెలుపుతూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె షూటింగ్‌ విభాగంలో స్వర్ణంతోపాటు కాంస్య పతకం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అవని చరిత్ర సృష్టించిం దన్నారు. రానున్న రోజుల్లో మనదేశానికి మరిన్ని పతకాలు సాధించి దేశ క్రీడాప్రతిష్టను ఇనుమడింపచేయాలని నామా ఆకాక్షించారు. హైజంప్‌ విభాగంలో రజత పతకం గెలిచిన అథ్లెటిక్స్‌ ప్రవీణ్‌ను నామా అభినందించారు. పతకాలు సాధిస్తున్న క్రీడాకా రులకు ఎంపీ నామ శుబాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-09-04T05:02:25+05:30 IST