అది గ్రామకంఠం భూమి కాదు
ABN , First Publish Date - 2021-10-26T05:29:26+05:30 IST
‘గ్రామ కంఠం భూములపై ఆలయ అధికారుల పెత్తనమేమిటి? గృహాలను తొలగించడానికి మీకేం అధికారం ఉంది’ అని జమలాపురం సర్పంచ్ మల్పూరి స్వప్న పేరుతో వచ్చిన వార్తను దేవస్థానం అధికారులు ఖండించారు.

జమలాపురం సర్పంచ్ ఆరోపణనలకు దేవాలయ అధికారుల ఖండన
ఎర్రుపాలెం, అక్టోబరు 25: ‘గ్రామ కంఠం భూములపై ఆలయ అధికారుల పెత్తనమేమిటి? గృహాలను తొలగించడానికి మీకేం అధికారం ఉంది’ అని జమలాపురం సర్పంచ్ మల్పూరి స్వప్న పేరుతో వచ్చిన వార్తను దేవస్థానం అధికారులు ఖండించారు. జమలాపుంర ఈవో కొత్తూరు జగన్మోహన్‌రావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆవార్తలోఎలాంటి నిజం లేదన్నారు. దేవస్థానం భూమి సర్వే నెంబర్ 6,7లో 59 మంది గుడిసెలు, తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకున్నారన్నారు. వారిపై కోర్టులో కేసు వేయడంతో ఆ స్థలాలు ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించిందన్నారు. అప్పుడు 25మందిని ఖాళీ చేయించామన్నారు. మిగిలిన 34 మందిపైకి అనేక సార్లు నోటీసులు ఇచ్చిన వారు ఖాళీ చేయలేదన్నారు. సర్పంచ్ చెప్పినట్టు ఆ భూమి దేవాదాయ శాఖది అని అది గ్రామకంఠం కాదన్నారు. ప్రభుత్వ ఆదేశం మేరకు అన్యకాంత్రం అయిన దేవాదాయ శాఖ భూములను కాపాడతామన్నారు. దేవస్థానంలో భక్తులసౌకర్యాల ఏర్పాటు దేవస్థాన పిటీషన్లపై ఎంక్వయిరీ, తదితర పనులపై రావడం జరిగిందని, అంతేకాని దేవాదాయశాఖ ఉప కమిషనర్ ఎలాంటి ప్రెస్ మీట్‌లు కానీ, ప్రెస్‌నోట్‌లుకాని ఇవ్వలేదని సర్పంచ్ ఆరోపణల్లో ఎటువంటి వాస్తవంలేదని, ఆమె ప్రచురింపచేసిన కథనాలను ఖండిస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు.