ట్రెసా నూతన కార్యవర్గం

ABN , First Publish Date - 2021-11-01T04:51:29+05:30 IST

తెలంగాణ రె వెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా తుంబూరు సునీల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ట్రెసా నూతన కార్యవర్గం

‘ట్రెసా’ జిల్లా అధ్యక్షుడిగా సునిల్‌రెడ్డి

ఖమ్మం కలెక్టరేట్‌ అక్టోబరు 31: తెలంగాణ రె వెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా తుంబూరు సునీల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ట్రెసా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తుండూరు సునీల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డి పుల్లయ్య, కోశాధికారిగా ఎం క్రాంతికుమార్‌ ఎన్నికయ్యారు. రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు పూల్‌సింగ్‌ ఎన్నికల అధికా రిగా వ్యవహరించారు.  జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఎండీ ముజాహిద్‌, కెవి పవన్‌కుమార్‌, ఉపాధ్యక్షుడిగా సిహెచ్‌ సత్యనారాయణ, సిహెచ్‌ రమణి, కెవి ప్రసాద్‌, వి వెంకన్న, డి రవి, సహాయ కార్యదర్శులుగా సిహెచ్‌ సురేష్‌ బాబు, కె కిరణ్‌కుమార్‌, జి ప్రకాష్‌, బి శ్రీలత, ఎంఏ అన్సారీ ఎన్నికయ్యారు. వీరితో పాటు ఆర్గనైజింగ్‌ సెక్రట రీలుగా తుమ్మ రవీందర్‌, డి.సైదులు, వి నరేష్‌కుమార్‌ ఎన్నికయ్యారు. 

కలెక్టర్‌ అభినందన

 ట్రెసా కార్యవర్గాన్ని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదివారం అభినందించారు. జిల్లా అధ్యక్షుడు తుంబూరు సునీల్‌రెడ్డి, తాజా మాజీ అధ్యక్షుడు కారుమంచి శ్రీనివాసరావు నూతన కమిటీ సభ్యులు కలెక్టర్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్చాలిచ్చి కలెక్టర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి బొగ్డారపు వెంకటేశ్వర్లు తదితరులున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని టీఎన్జీవో అడ్హక్‌ కమిటీ కన్వీనర్‌ ఎస్కే అఫ్జల్‌హాసన్‌, టీఎన్జీవో నాయకులు ఎండీ మజీద్‌, ఆర్వీఎస్‌ సాగర్‌, నందగిరి శ్రీను, శ్రీనివాసరెడ్డి తదితరులు అభినందించారు. 

Updated Date - 2021-11-01T04:51:29+05:30 IST