టెండర్‌ ఓటు నమోదు

ABN , First Publish Date - 2021-03-14T05:30:00+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇల్లెందు పట్టణంలోని సింగరేణి పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో ఒక దొంగ ఓటు నమోదైంది. 220 పోలింగ్‌ బూత్‌లో పట్టణంలోని 14వనెంబర్‌బస్తీకి చెందిన శనిగరం రాఽధ ఓటు

టెండర్‌ ఓటు నమోదు

ఇల్లెందు, మార్చి14: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇల్లెందు పట్టణంలోని సింగరేణి పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో ఒక దొంగ ఓటు నమోదైంది. 220 పోలింగ్‌ బూత్‌లో పట్టణంలోని 14వనెంబర్‌బస్తీకి చెందిన శనిగరం రాఽధ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లగా అప్పటికే అమె ఓటును వేరొకరు వేసినట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. ఎన్నికల అధికారులు శనిగరం రాధకు టెండర్‌ ఓటును జారీ చేయడంతో అమె టెండర్‌ఓటును వినియోగించారు. ఇల్లెందు పట్టణంలోని 24ఏరియాకు చెందిన కొదురుపాక సంపత్‌కుమార్‌ ఉపాధ్యాయుడు ఓటు వేసేందుకు ఆన్‌లైన్‌ స్లిప్‌తో వెళ్లగా ఆయన పేరు లేకపోవడంతో వెనుతిరిగారు. ఎల్‌బీఎస్‌నగర్‌కు చెందిన ఒక పట్టభద్రుడు ఓటు కోసం వెళ్లగా తన ఓటు ఉన్న సీరియల్‌లో మరో వ్యక్తి పేరు నమోదయ్యింది. దీంతో పట్టభద్రుడు అధికారులు ఓటు వినియోగించుకోవడానికి నిరాకరించారు.  

Updated Date - 2021-03-14T05:30:00+05:30 IST