తెలంగాణ ఉద్యమకారుడు నాగేశ్వరరావు మృతి
ABN , First Publish Date - 2021-02-09T05:15:02+05:30 IST
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, వైరా టీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఇన్‌చార్జ్ మండల పరిధిలోని తవిసిబోడుకు చెందిన భుక్యా నాగేశ్వరరావు(60)సోమవారం ఉదయం మృతి చెందారు.
కొంతకాలం నుంచి అనారోగ్యం
అందని సర్కారు సాయం
ఆరోగ్యం క్షీణించి కన్నుమూత
పలువురు టీఆర్‌ఎస్ నేతల నివాళులు
కారేపల్లి, ఫిబ్రవరి 8: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, వైరా టీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఇన్‌చార్జ్ మండల పరిధిలోని తవిసిబోడుకు చెందిన భుక్యా నాగేశ్వరరావు(60)సోమవారం ఉదయం మృతి చెందారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అప్పటి ఉద్యమకారుడు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్‌ఎస్‌లో చేరా రు. ఉద్యమ సమయంలో అనేక సార్లు జైళ్లకు వెళ్లారు. 2009 నుంచి 2014 వరకు వైరా ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. ఈప్రాంతంలో అనేక మందితో ఉద్యమాలు నిర్వహించారు. కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యారు. ప్రభుత్వం సాయం చేస్తుందని, కనీసం మెరుగైన వైద్యం అందిస్తుందని నాగేశ్వరరావు కుటంబం ఎంతగానో ఎదురు చూసింది. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణిం చి సోమవారం మృతి చెందారు. నాగేశ్వరరావు మృతి వార్త తెలుసుకున్న భద్రాద్రి జిల్లా గ్రంఽథాలయసంస్థ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, ఉద్యకారులు జడల వెంకటేశ్వర్లు, జడల వసంత, ఉప్పల వెంకటరమణ, భూక్యా చందు, నాగరాజు, ఎల్.రాము, ఝూంకిలాల్, మండల ఎంపీపీ శకుంతల, అజ్మీర వీరన్న, రావూరి శ్రీనివాస్‌రావు, ఉన్నం వీరేందర్ తవిసిబోడుకు వెళ్లి నాగేశ్వరరావు మృతదేహానికి నివాళులర్పించారు.
ఉద్యమకారుడి కుటుంబానికి ఆర్థికసాయం
ఖమ్మం కార్పొరేషన్, ఫిబ్రవరి 8: అనారోగ్యంతో మృతిచెందిన మలిదశ ఉద్యమకారుడు భూక్యా నాగేశ్వరరావు కుటుంబానికి టీఆర్‌ఎస్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ గుండాల (ఆర్‌జేసీ) కృష్ణ రూ. 10వేలు ఆర్థికసాయం అందచేశారు. టీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర కార్యదర్శి రడం సురేష్ ద్వారా సోమవారం నగదును నాగేశ్వరరావు కుటుంబానికి పంపారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ తెలంగాణా మలిదశ ఉద్యమంలో నాగేశ్వరరావు కీలకపాత్ర వహించాడని, ఆయన మృతి తనను తీవ్రంగా కలిచివేసందన్నారు. నాగేశ్వరరావు కుటుంబానికి టీఆర్‌ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా మలిదశ ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు గుండ్లపల్లి శేషు పాల్గొన్నారు.