హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్
ABN , First Publish Date - 2021-02-02T05:14:23+05:30 IST
ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి రామచందర్‌రావు విమర్శించారు.

టీడీపీ మహబూబాబాద్ పార్లమెంటు అధ్యక్షుడు రామచందర్‌రావు
బూర్గంపాడు, ఫిబ్రవరి 1: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి రామచందర్‌రావు విమర్శించారు. సోమవారం సారపాకలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ నేతలకు ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదన్నారు. సారపాకకు చెందిన ఆకుల పద్మ టీడీపీలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శులుగా మండలానికి చెందిన కురిచేటి వెంకటేశ్వరరావు, సంగు సుబ్బారెడ్డిని, మహిళా కార్యదర్శులుగా తాత మాధవీలతను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రేమ్‌చంద్, వాసు, కురిచేటి వెంకటేశ్వరరావు, సత్యనారయణ, గల్లా నాగభూషయ్య, చావా మహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, కర్రి రాజేంద్రప్రసాద్, జీవన్‌రెడ్డి, గోల్కొండ సాగర్, కృష్ణ పాల్గొన్నారు.