పట్టణాలకు దీటుగా పల్లెల సుందరీకరణ

ABN , First Publish Date - 2021-12-31T05:51:49+05:30 IST

పట్టణాలకు దీటుగా పల్లెల సుందరీకరణ

పట్టణాలకు దీటుగా పల్లెల సుందరీకరణ
ట్యాంక్‌బండ్‌ నిర్మాణపనులను ఎమ్మెల్సీ బాలసానితో కలిసి ప్రారంభిస్తున్న మంత్రి అజయ్‌కుమార్‌ట్యాంక్‌బండ్‌ నిర్మాణపనులను ఎమ్మెల్సీ బాలసానితో కలిసి ప్రారంభిస్తున్న మంత్రి అజయ్‌కుమార్‌

అనువైన చెరువులు ట్యాంక్‌బండ్‌లుగా ఏర్పాటు

రఘునాథపాలెం మండల పర్యనటలో మంత్రి పువ్వాడ 

వేపకుంట్లలో ట్యాంక్‌బండ్‌కు శంకుస్థాపన 

రఘునాథపాలెం, డిసెంబరు 30: పట్టణాలకు దీటుగా పల్లెల ను రూపుదిద్దుతున్నామని, పార్కులు, ట్యాంక్‌బండ్‌లతో సుందరీ కరణ సంతరించుకుంటున్నాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం రఘునాథపాలెం మం డలం వేపకుంట్ల గ్రామంలో ఎమ్మెల్సీ నిధులు రూ.25లక్షలతో నిర్మించనున్న ట్యాంక్‌బండ్‌కు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారా యణతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనువైన చెరువులన్నిటిని ట్యాంక్‌బండ్‌ లుగా మారుస్తామని, నగరంలో లకారం తరహాలోనే రఘునాథ పాలెంలో ట్యాంక్‌బండ్‌ ఏర్పాటు చేశామని, అలాగే వేపకుంట్ల గ్రామంలోనూ ట్యాంక్‌బండ్‌ నిర్మించ తలపెట్టామన్నారు. ఇక బృహత్‌పల్లెప్రకృతి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నిధులను అందించిన బాలసానిని మంత్రి సత్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ డౌలె లక్ష్మీప్రసన్న, వైస్‌చైర్మన్‌ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ దారా శ్యామ్‌సుందర్‌, ఎంపీటీసి సభ్యురాలు వనజా రాణి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, మాజీ వైస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, కుర్రా భాస్కర్‌, వీరు నాయక్‌, సర్పంచ్‌లు మాధంశెట్టి హరిప్రసాద్‌, మెంటెం రామా రావు, ప్రదీప్‌, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.

కుల ధ్రువీకరణ పత్రాలు అందించటం భేష్‌..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అధికారులే నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలు అందించటం అభినందనీయమని మంత్రి అజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం రఘునాథపాలెం జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యార్థులకు కులధ్రువీకరణ పత్రాలను అందించారు. ఈ పత్రాల కోసం విద్యార్థులు, వారి తల్లిదం డ్రులు ఎంతో ఇబ్బందులు పడేవారని, అధికారులే సుమోటోగా తీసుకొని అర్హులైన ప్రతీ విద్యార్థికి కుల ధ్రువీకరణ పత్రం అందించడం శుభపరిణామమన్నారు. ఇందుకోసం ప్రత్యేక కృషి చేసిన కలెక్టర్‌ గౌతమ్‌ను మంత్రి అభినందించారు. ఖమ్మం జిల్లాలో 6వేల మంది విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు అందించనున్నట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-31T05:51:49+05:30 IST