కబళించిన విద్యుత ఉచ్చు

ABN , First Publish Date - 2021-12-08T05:21:23+05:30 IST

అడవి జంతువుల వేట కోసం పెట్టిన విద్యుత ఉచ్చు ఆ ఇంట తీరని విషాదాన్ని మిగిల్చింది. కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషించే తండ్రీ కొడుకులు అడవి జంతువుల వేటకు వెళ్లి ఎవరో అమర్చిన విద్యు

కబళించిన విద్యుత ఉచ్చు

 అడవి జంతువులకోసం అమర్చిన కరెంట్‌ తీగలకు తగిలి తండ్రీకొడుకులు మృతి

మరొకరికి తీవ్రగాయాలు

దమ్మపేట మండలం రంగువారిగూడెంలో విషాదం 

దమ్మపేట, డిసెంబరు 7: అడవి జంతువుల వేట కోసం పెట్టిన విద్యుత ఉచ్చు ఆ ఇంట తీరని విషాదాన్ని మిగిల్చింది. కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషించే తండ్రీ కొడుకులు అడవి జంతువుల వేటకు వెళ్లి ఎవరో అమర్చిన విద్యుత ఉచ్చులకు తగిలి బలైపోయారు. దమ్మపేట మండలం రంగువారిగూడెం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పొలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. రంగువారిగూడెం గ్రామానికి చెందిన ప్రొద్దుటూరి డానియల్‌ (43)అతడి కుమారుడు రాకేష్‌ (22), డానియల్‌ సోదరుడి కుమారుడు విజయ్‌కుమార్‌ ముగ్గురు కలిసి సోమరాత్రి రాత్రి 10గంటల సమయంలో అడవిజంతువుల షికారుకు అకినేపల్లి శివారు అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఒక మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పటికే అటవీ జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత వైర్లకు ఈ ముగ్గురు తగలటంతో తండ్రీ కొడుకులు డానియెల్‌, రాకేష్‌ అక్కడిక్కడే మృతి చెందగా.. విజయ్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ విజయ్‌కుమార్‌ వెంటనే డానియల్‌ భార్య సుజాతకు ఫోన్‌ చేసి విషయం చెప్పడంతో ఆమె తమ బంధువులను తీసుకొని సంఘటనా స్థలానికి వెళ్లగా భర్త, కుమారుడు చనిపోయి ఉన్నారు. తీవ్రంగా గాయపడి సృహతప్పి పడిపోయిన విజయ్‌ను వెంటనే అశ్వారావుపేట ప్రభుత్వవైద్యశాలకు తరలించగా.. పరిస్థితి విషమయంగా ఉండడంతో కొత్తగూడెం తరిలించినట్లు సమాచారం. డానియెల్‌ భార్య సుజాత ఫిర్యాదు మేరకు దమ్మపేట పోలీసులు ఎస్‌హెచ్‌వో వెంకటరాజు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని అశ్వారావుపేట సీఐ ఉపేందర్‌, దమ్మపేట ఎస్‌హెచ్‌వో పరీశీలించి వివరాలు సేకరించారు. డానియెల్‌ కుటుంబం కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అతడికి ఒక కుమారుడు, కమార్తె ఉన్నారు. కూలి పనులు చేస్తూనే డానియల్‌ కుమారుడు రాకేష్‌ను డిగ్రీ వరకు చదివించాడు. ప్రస్తుతం కుమార్తె చదువుకుంటోంది. రాకేష్‌కు ఉద్యోగం రాకపోవటంతో తండ్రితోపాటు ప్రతిరోజు పామాయిల్‌ గెలలను నరికే పనులకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఇలా విద్యుత ఉచ్చుకు బలవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 

Updated Date - 2021-12-08T05:21:23+05:30 IST