సమ్మెతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
ABN , First Publish Date - 2021-12-10T04:51:38+05:30 IST
నాలుగు బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు గురువారం సమ్మె చేపట్టారు.

రూ.4.25కోట్ల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్
ప్రైవేటీకరణతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకం: కార్మిక సంఘాలు
సత్తుపల్లిరూరల్, డిసెంబరు 9: నాలుగు బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు గురువారం సమ్మె చేపట్టారు. జాతీయ సంఘాలు ఏఐటీయూసీ, ఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, బీఎంఎ్‌సతో పాటు ప్రాంతీయ సంఘం టీబీజీకేఎస్ సంఘాలు మూడు రోజుల సమ్మెకు పిలుపునివ్వగా సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల వద్ద సమ్మెకు సంపూర్ణంగా సాగింది. మొదటి షిప్ట్ ఉదయం 7గంటల నుంచి సమ్మెలో కార్మికులు పాల్గొన్నారు. రెండు ఓసీలలో సెక్యూరిటీ, అత్యవసర సిబ్బంది సుమారు 50మంది మినహా మిగతా 750మంది కార్మికులు ప్రాజెక్టులోకి వెళ్లకుండా విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా జేవీఆర్ ఓసీలో మూడు షిప్టులకు గానూ 24వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కిష్టారంలో షిప్టు 5వేల మెట్రిక్ టన్నులు మొత్తం 15వేల టన్నులు నిలిచిపోయింది. అయితే రెండు ఓసీలలో జీ-8, జీ-13, జీ-15 రకాల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా వాటి ధరలు వరుసుగా టన్నుల్లో పరిశీలిస్తే రూ.3200, రూ.1800, రూ.1300 ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే రెండు ఓసీలకు గానూ సుమారు రూ.4.25కోట్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
వేలాన్ని ఆపేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి: కార్మిక సంఘాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. బొగ్గు వేలాన్ని ఆపకపోతే కార్మికులు, వారి కుటుంబాలతో సంస్థ మనుగడ ప్రశ్నార్ధకమవుతుందన్నారు. కార్యక్రమంలో దారా బీమయ్య, కాగిదం వెంకటేశ్వర్లు, భరణి, అజ్గర్‌ఖాన్, చంద్రశేఖర్, వెంకటరమణ, జేఎ్‌సఆర్.మూర్తి, చెన్నకేశవరావు, జీ.శ్రీనివాస్, గణపనేని శ్రీనివాస్, గద్దె మురళీ, బాణోతు శ్రీనివాస్, యూసఫ్, నాయకులు దండు ఆదినారాయణ, తడికమళ్ల యోబు, నిమ్మటూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.