ప్రభుత్వానిది రైతు ఎజెండా

ABN , First Publish Date - 2021-01-19T05:22:23+05:30 IST

రైతు ఎజెండానే రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా అని, రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ప్రపంచమే గర్వించేలా పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వానిది రైతు ఎజెండా
అశ్వారావుపేటలో జరిగిన సభలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ

భద్రాద్రి జిల్లాలో 6,443 డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం

రవాణాశాఖ మంత్రి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

అశ్వారావుపేటలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

అశ్వారావుపేట రూరల్‌, జనవరి 18: రైతు ఎజెండానే రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా అని, రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ప్రపంచమే గర్వించేలా పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో సోమవారం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ భద్రాద్రి జిల్లాకు 6,443 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరుకాగా ఇప్పటి వరకు సుమారు 2,000 ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులకు అందించామని, మిగిలిన 4,443 గృహాలను మార్చిలోగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ప్రత్యేక రాష్ట్రంగా మారితే తెలంగాణ చీమ్మచీకట్లో ఉంటుందని ఉద్యమ సమయంలో అనేకమంది మాట్లాడారని, కానీ నేడు రాష్ట్ర  ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24గంటల కరెంటు ఇస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. ఐక్యరాజ్యసమితిలో కూడా అందరూ మెచ్చుకునేలా  రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమాను అమలు చేస్తోందన్నారు. గతంలో రైతులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించుకునేందుకు అరుగులు, చెట్లను ఆశ్రయించేవారని, కానీ రైతులంతా సంఘటితం కావాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి రైతువేధికలను నిర్మించిందన్నారు. గిరిజన ప్రాంతమైన అశ్వారావుపేటలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా పాటుపడతానన్నారు. గిరిజన ప్రాంతమైన అశ్వారావుపేటలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా పాటుపడతానన్నారు. అశ్వారావుపేట అంటేనే పామాయిల్‌ అని, ఆయిల్‌పాం సాగుకు రాష్ట్రంలోనే అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉందని నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. అశ్వారావుపేట ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరారవు మాట్లాడుతూ స్థలాల కొరతతో అనేకచోట్ల డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభహించలేదని, అలా కాకుండా పేదలు సొంత స్థలంలోనే ఇళ్ల నిర్మాణం చేసుకునేలా ప్రభుత్వం జీవో ఇచ్చేలా సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని, గిరిజనులకు పోడు పట్టాలు వచ్చేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా పలు పంచాయతీల సర్పంచులు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో కల్టెక్టర్‌ ఎంవీ. రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ కోరం కరకయ్య, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, రైతుబంధు సమితి భద్రాద్రి జిల్లా కన్వీనర్‌ అంకిరెడ్డి కృష్ణారెడ్డి, పేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జడ్పీటీసీ వరలక్ష్మీ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ జూపల్లి రమేశ్‌, డీసీసీబీ డైరెక్టర్‌ నిర్మల పుల్లారావు, సొసైటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, ఏడీఏ అభిమన్యుడు, ఏడీ అఫ్జల్‌భేగం, తహసీల్దార్‌ చల్లా ప్రసాద్‌, ఎంపీడీవో విజయ, సర్పంచ్‌ నార్లపాటి సుమతి, అట్టం రమ్య, స్వరూప, పరమేశ్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు నారం రాజశేఖర్‌, తదిరతులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-19T05:22:23+05:30 IST