క్రీడాకారులకు సర్పంచ్‌ ఆర్థికసాయం

ABN , First Publish Date - 2021-08-20T05:35:52+05:30 IST

ఈనెల 4,5 తేదీలలో జమ్ము-కశ్మీర్‌లో నిర్వహించే జాతీయస్ధాయి అండర్‌ టర్మ్‌ సెలక్షన్స్‌ వెళ్లే క్రీడాకారులకు సీతాయిగూడెం సర్పంచ్‌ కారం సుధీర్‌ రూ. పదివేలను గురువారం అందజేసారు.

క్రీడాకారులకు సర్పంచ్‌ ఆర్థికసాయం
క్రీడాకారులకు ఆర్ధిక సహాయం అందిస్తున్న సర్పంచ్‌

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

ముల్కలపల్లి , ఆగస్టు 19: ఈనెల 4,5 తేదీలలో జమ్ము-కశ్మీర్‌లో నిర్వహించే జాతీయస్ధాయి అండర్‌ టర్మ్‌ సెలక్షన్స్‌ వెళ్లే క్రీడాకారులకు సీతాయిగూడెం సర్పంచ్‌ కారం సుధీర్‌ రూ. పదివేలను గురువారం అందజేసారు. ‘క్రీడల్లో గెలిచి...పేదరికంలో ఓడి’ అనే కఽథనం గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైమంది. దీనికి స్పందించిన కారం సర్పంచ్‌ సుధీర్‌ గండిప్రోళ్లుకు చెందిన క్రికెట్‌ క్రీడాకారులు కీసర వసంత్‌కుమార్‌, సవలం కృపకు ఆర్థికసహాయాన్ని అందజేశారు. ఈసందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో సుధీర్‌ మాట్లాడుతూ క్రీడాకారుల ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవడం వల్లే తాను నగదు అందజేశానని అన్నారు. ఈసందర్భంగా సుధీర్‌కు వసంత్‌కుమార్‌, కృప కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2021-08-20T05:35:52+05:30 IST