కాలానికి అనుగుణంగా నైపుణ్యం పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-11-23T05:31:16+05:30 IST

కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలని మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీ.హరికృష్ణ అన్నారు.

కాలానికి అనుగుణంగా నైపుణ్యం పెంచుకోవాలి

‘మిస్ట్‌లో సాప్ట్‌వేర్‌ కోర్సుపై వర్క్‌షాప్‌

సత్తుపల్లి, నవంబరు 22: కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలని మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీ.హరికృష్ణ అన్నారు. ప్రొఫెషనల్‌ ఆటోక్యాడ్‌ అనే సాప్ట్‌వేర్‌ కోర్సుపై బీటెక్‌ 3,4వ సంవత్సరం సివిల్‌, మెకానికల్‌ విద్యార్థులకు రెండు రోజుల పాటు కళాశాలలో సాగే వర్క్‌షాప్‌ సోమవారం ప్రారంభమైంది. తక్కువ సమయంలో బిల్డింగ్‌ ప్లాన్లను అధునాతనంగా గీయవచ్చునని, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఈ కోర్సుతో అభిరుచులకు తగ్గట్లు డిజైన్లను రూపొందింవచ్చునన్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ విభాగం డీన్‌ డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధిపతి ఎల్‌.ఇంద్రసేనారెడ్డి, మెకానికల్‌ విభాగం అధిపతి టీ.రాఘవరాజుతో పాటు విద్యార్ధులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-23T05:31:16+05:30 IST