కోలిండియాలో సింగరేణి కీర్తి చాటాలి

ABN , First Publish Date - 2021-12-08T04:27:04+05:30 IST

కోలిండియా స్థాయిలో జరిగే పోటీల్లో క్రీడాకారులు ప్రతిభను చాటి సింగరేణి కీర్తి, ప్రతిష్ఠలను పెంచాలని ఏరియా జీఎం జక్కం రమేష్‌ అన్నారు

కోలిండియాలో సింగరేణి కీర్తి చాటాలి
క్రీడల ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతున్న జీఎం రమేష్‌

సింగరేణి క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో జీఎం రమేష్‌

మణుగూరుటౌన్‌, డిసెంబరు 7: కోలిండియా స్థాయిలో జరిగే పోటీల్లో క్రీడాకారులు ప్రతిభను చాటి సింగరేణి కీర్తి, ప్రతిష్ఠలను పెంచాలని ఏరియా జీఎం జక్కం రమేష్‌ అన్నారు. మంగళవారం ఏరియాలోని భద్రాద్రి స్టేడియంలో సింగరేణి స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో మాట్లాడారు. సింగరేణి స్థాయి క్రీడలను మణుగూరులో నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించడం, పదకొం డు ఏరియాల నుంచి దాదాపు మూడు వందల మంది క్రీడల్లో పాల్గొనేందుకు మణుగూరు రావడం సంతోషంగా ఉందన్నారు. శరీరానికి తగిన శ్రమను కల్పించకపోతే బద్ద కం వచ్చేస్తుందని, చేసే పని పట్ల ఆసక్తి తగ్గిపోతుం దన్నారు. శరీరం బలీయంగా, ఉల్లాసంగా ఉండాలంటే ఆటలు ఆడాలన్నారు. దీనివల్ల శారీరక దారుఢ్యం పెరుగు తుందన్నారు. కోలిండియా జరిగే పోటీల్లో క్రీడాకారులు అ త్యధిక బహుమతులు సాధించి సింగరేణి పతాకాన్ని ఎగు రవేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రీడాకారులం దరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రంగురంగుల బెలూన్లను గాలిలోకి వదిలి క్రీడలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు నిర్వహించిన తొలి 800 మీటర్ల రన్నింగ్‌ రేసును చెండా ఊపి ప్రారంభించారు. తొలి పో టీల్లో మందమర్రి ఏరియాకు చెందిన క్రీడాకారిణి ప్రధమ బహుమతి సాధించింది. కార్యక్రమంలో ఏజీఎం సివిల్‌ వెంకటేశ్వర్లు, పీకేవోసీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ లక్ష్మీపతిగౌడ్‌, డీజీఎం ఫైనాన్స్‌ వెంకటరమణ, డిజిఎం పర్సనల్‌ ఎస్‌ రమేష్‌, సీనియర్‌ పర్సనల్‌ అధికారులు మాదార్‌ సాహెబ్‌, సింగు శ్రీనివాస్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ జాన్‌వెస్లీ, టీబీజీకే ఎస్‌ ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T04:27:04+05:30 IST