జేఎంఈటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-01-21T04:23:17+05:30 IST

జేఎంఈటీ ఉద్యో గాల భర్తీ కోసం సింగరేణి యాజమాన్యం తక్షణమే నోటీఫికేషన్‌ విడుదలచేసి మైనింగ్‌ డిప్లొమా పూర్తిచేసిన ని రుద్యోగులకు సంస్థలో ఉద్యోగాలు కల్పించాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు దమ్మాలపాటి శేషయ్య, గుత్తుల సత్యనారాయణ, వంగా వెంకట్‌లు డిమాండ్‌ చేశారు.

జేఎంఈటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాలి
సింగరేణి హెడ్డాఫీసు ఎదుట ధర్నా

రుద్రంపూర్‌ (సింగరేణి), జనవరి 20: జేఎంఈటీ ఉద్యో గాల భర్తీ కోసం సింగరేణి యాజమాన్యం తక్షణమే నోటీఫికేషన్‌ విడుదలచేసి మైనింగ్‌ డిప్లొమా పూర్తిచేసిన ని రుద్యోగులకు సంస్థలో ఉద్యోగాలు కల్పించాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు దమ్మాలపాటి శేషయ్య, గుత్తుల సత్యనారాయణ, వంగా వెంకట్‌లు డిమాండ్‌ చేశారు. సింగరేణి యాజమాన్యం విడుదల చేస్తున్న నోటీఫికేషన్‌లో జేఎంఈటీ ఉద్యోగాలను చేర్చాలని డిమాండ్‌చేస్తూ బుధవారం స్థానిక శేషగిరి భవన్‌ నుంచి బస్టాండ్‌, పోస్టాఫీస్‌ సెంటర్‌ల మీదుగా సింగరేణి ప్రధాన కార్యాలయం వరకు మైనింగ్‌ డిప్లొమా పట్టభద్రులు ప్రద ర్శన నిర్వహించి కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... జేఎం ఈటీ ఉద్యోగాల నియామకాలు చేపట్టిన యాజమాన్యం ఆరు సంవత్సరాలు గడుస్తున్నా... ఉద్యోగ ప్రకటన విడుదల చేయకుండా జాప్యం చేస్తుందన్నారు. సంస్థలో జేఎంఈటీ ఖాళీలు ఉన్నప్పటికీ ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులతోనే పనిచేయిస్తూ పని భారం మోపుతూ కాలం వెళ్లదీస్తున్నా రని ఆరోపించారు. సింగరేణి సంస్థలో ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశతో కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లోని కార్మికులు, మా జీ కార్మికుల పిల్లలు మైనింగ్‌ డిప్లొమా కోర్సులు పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. త్వరలో 651 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించిన యాజమాన్యం వీటిలో జేఎంఈటీ పోస్టులు చేర్చకపోవడంతో డిప్లొమా పట్టభద్రులు నిరాశకు గురవుతున్నారని, యాజమాన్యం స్పందించి సింగరేణి సంస్థను నమ్ముకొని మైనింగ్‌ డిప్లొమా పూర్తిచేసిన యువతకు సంస్థలో ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అం దజేశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా నాయకులు ఎస్‌కే. ఖయ్యూం, ఎస్‌కే. ఫహీమ్‌ దాదా, వివిధ ఏరియాలకు చెందిన మైనింగ్‌ డిప్లొమా పట్టభద్రులు పి. యువసాయి రాజా, జె.వినయ్‌, రణధీర్‌, శ్రీకాంత్‌, హరికృష్ణ, సల్మాన్‌, విఘ్నేష్‌, రాంబాబు, మనోజ్‌, అన్వేష్‌, సాయికృష్ణ, రోషన్‌, సాయి కిరణ్‌, నాగబాబు, వెంకట్‌, గిరిప్రసాద్‌, రాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-21T04:23:17+05:30 IST