రెండు ఇసుక ట్రాక్టర్ల సీజ్
ABN , First Publish Date - 2021-10-21T04:47:00+05:30 IST
మండల పరిదిలోని దుద్దెపూడి గ్రామ సమీపంలో ఉన్న తమ్మిలేరు వాగు నుంచి రాత్రి వేళలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్‌లను బుధవారం తెల్లవారుజమున రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.

వేంసూరు, అక్టోబరు 20: మండల పరిదిలోని దుద్దెపూడి గ్రామ సమీపంలో ఉన్న తమ్మిలేరు వాగు నుంచి రాత్రి వేళలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్‌లను బుధవారం తెల్లవారుజమున రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్న వీఆర్‌ఏ కల్పనను సస్పెండ్ చేస్తునట్లు తహసీల్దార్ ముజయిద్దీన్ తెలిపారు. ఇటివల కట్టలేరులో ఇసుక అక్రమ రవాణ జరగడం అందుకు భాధ్యుడైనా అడసర్లపాడు వీఆర్‌ఏను సస్పెండ్ చేసిన అనంతరం మండలంలో ఇసుక నిల్వలు ఉన్న గ్రామలలో ఇతర గ్రామలకు చెందిన రెవెన్యూ సిబ్బందితో తహసీల్దార్ నిఘా ఏర్పాటు చేశారు. ట్రాక్టర్‌లను సీజ్ చేసిన అనంతరం డిప్యూటీ తహసీల్దార్ దుద్దెపూడిలో వీఆర్‌ఏ కల్పన పనితీరుపై విచారణ జరపగా ఆమె సహకరంతోనే ఇసుక అక్రమ రవాణ జరుగుతున్నట్లు తేలడంతో అమె పై చర్యల నిమిత్తం సస్పెండ్ చేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు.