24న ప్రగతి భవన్‌ ముట్టడి

ABN , First Publish Date - 2021-08-22T04:51:29+05:30 IST

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, నిరుద్యోగుల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 24న తలపెట్టిన చలోప్రగతి భవన్‌ ముట్టడిని విజయవంతం చేయాలని పీడీఎస్‌యు రాష్ట్రప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము పిలుపునిచ్చారు.

24న ప్రగతి భవన్‌ ముట్టడి

 పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాము 

ఖమ్మంమయూరిసెంటర్‌, ఆగస్టు21: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, నిరుద్యోగుల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 24న తలపెట్టిన చలోప్రగతి భవన్‌ ముట్టడిని విజయవంతం చేయాలని పీడీఎస్‌యు రాష్ట్రప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం లో జరిగిన జనరల్‌బాడీ సమాశంలో మాట్లాడారు. కేసీ ఆర్‌ విద్యార్ధులను, నిరుద్యోగులను నిత్యం మోసం చేస్తున్నారని అన్నారు. స్కాలర్‌ షిప్‌లు విడుదల చేయ కుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఎన్నికలప్పుడు మాత్రమే ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ మభ్యపె డుతున్నారని ఆరోపించారు. వేంటనే నిరుద్యోగ ప్రకటన చేయలని పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.శరత్‌, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆజాద్‌, వెంకటేష్‌, మస్తాన్‌, నవీన్‌, కిరణ్‌, పవన్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-08-22T04:51:29+05:30 IST