రైలులో 27 కేజీల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-12-16T05:16:24+05:30 IST

కోణార్కు ఎక్స్‌ప్రెస్‌ రైలులో తరలిస్తున్న 27కేజీల గంజాయి బుధవారం ఖమ్మం జీఆర్పీ, ఆర్‌పీయఫ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రైలులో 27 కేజీల గంజాయి పట్టివేత

ఖమ్మం క్రైం, డిసెంబరు15: కోణార్కు ఎక్స్‌ప్రెస్‌ రైలులో   తరలిస్తున్న 27కేజీల గంజాయి బుధవారం ఖమ్మం జీఆర్పీ, ఆర్‌పీయఫ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధిర నుంచి ఖమ్మం రైల్వేస్టేషన్ల్‌ మధ్యలో కోణార్కు ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం జీఆర్పీ, ఆర్‌పీయఫ్‌ పోలీసులు తనీఖీలు నిర్వహిస్తుండగా ఏసీ బోగిలో ఒడిషాకు చెందిన సాహు అనుమానస్పదంగా కనిపించాడు. అతడి బ్యాగులను తనీఖీలు చేయగా, 27కేజీల నాలుగు గంజాయి ప్యాకెట్ల్‌ కనిపించాయి. అతడిని అదుపులోకి తీసుకుని జీఆర్పీ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఆర్‌పీయఫ్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, ఏస్సైలు వెంకటరెడ్డి, రవికుమార్‌ ఖమ్మంలోని జీఆర్పీ స్టేషన్‌లో విచారణ చేశారు. గతంలో బట్టలు నేసే వారి వద్ద పని చేస్తుండగా సరిగ్గా డబ్బులు ఇవ్వటం లేదని చెప్పాడు. ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని బరంపుర్‌లో తక్కువ ధరకు కోనుగోలు చేసి ముంబైలో   అమ్మేందుకు తీసుకు వెలుతున్నట్టు విచారణలో ఒప్పుకున్నాడు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.7లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-12-16T05:16:24+05:30 IST