కమ్యూనిస్టులు బలపడితేనే దేశానికి భద్రత: సీపీఎం
ABN , First Publish Date - 2021-10-30T05:06:37+05:30 IST
దేశంలో కమ్యూనిస్టులు గల్లినుంచి డిల్లీ వరకు బలపడితేనే దేశంలో భద్రత సాద్యం అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్యాణం వెంకటేశ్వరరావు అశాభావాన్ని వ్యక్తం చేశారు.

పెనుబల్లి, అక్టోబరు 29: దేశంలో కమ్యూనిస్టులు గల్లినుంచి డిల్లీ వరకు బలపడితేనే దేశంలో భద్రత సాద్యం అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్యాణం వెంకటేశ్వరరావు అశాభావాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిదిలోని లంకపల్లి లో సీపీఎం పెనుబల్లి మండల 8వ మహసభ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు అమ్ముకుంటున్నారని, పోడుసాగుదారులకు పట్టాలు ఇవ్వమంటే కేసులు పెడుతూ కంపెనీలకు కట్ట పెడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రం లోని కేసీఆర్ ప్రభుత్వం మోదీ తెచ్చిన నల్ల చట్టలకు వంతపడుతుందని, ఎర్ర జెండాలను అధికారంలోని తెచ్చుకుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందన్నారు. సీనియర్ నాయకులు మూడ్ దూప్ సింగ్ జెండాను అవిష్కరించారు.
మండల కార్యదర్శిగా తిరుపతిరావు
పెనుబల్లి సీపీఎం మండల కార్యదర్శిగా మండాలపాడు గ్రామకి చెందిన గాయం తిరుపతిరావును శుక్రవారం లంకపల్లి లో జరిగిన మండల మహసభలో ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఇప్పటీవరకు మండల కార్యదర్శి గా పని చేసిన చలమాల విఠల్ రావు మూడు పర్యాయాలు పని చేశారు. ఈసభలో జిల్లా నాయకులు మాచర్ల భారతి, తాతాభాస్కర్ రావు, మోరంపూడిపాండురంగారావు,జాజిరి శ్రీనివాసరావు,రావుల రాజబాబు,మామిళ్ళ వెంకటేశ్వర్లు,తాండ్ర రాజేశ్వరరావు,అర్వపల్లి జగన్ మోహన్ రావు, తిరుపతిరావు, చలమాల నరసింహరావు, రాజారావు, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.