సరిహద్దుల్లో బందోబస్తు పెంచాలి: ఎమ్మెల్యే రాములునాయక్‌

ABN , First Publish Date - 2021-05-21T05:46:47+05:30 IST

మండలంలో పోలీసు సిబ్బంది మరింత అప్రమత్తమై పనిచేయాలని, సరిహద్దు ప్రాంతాల్లో బందోబస్తు పెంచాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యి రాములునాయక్‌ అన్నారు.

సరిహద్దుల్లో బందోబస్తు పెంచాలి: ఎమ్మెల్యే రాములునాయక్‌
అధికారులతో సమీక్షనిర్వహిస్తున్న ఎమ్మెల్యే

పంచాయతీ కార్యదర్శుల పనితీరు ఆఽధ్వానం 

వైద్యసేవలు అమోఘం 

అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష 

కారేపల్లి మే 20: మండలంలో పోలీసు సిబ్బంది మరింత అప్రమత్తమై పనిచేయాలని, సరిహద్దు ప్రాంతాల్లో బందోబస్తు పెంచాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యి రాములునాయక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఆరోగ్యకేంద్రాని ఆయన సందర్శించారు. వివిధ శాఖలఅధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా పోలీసు సిబ్బంది తీరు సరిగా లేదన్నారు. చెక్కు పోస్టులవద్ద సిబ్బందికూడా లేరన్నారు. కరోనా నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైనా చర్యలు తీసుకోవాలని, మండలానికి వచ్చే ప్రధాన రహదారిలో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయాలని రూరల్‌ సీఐ శ్రీనివా్‌సకు సూచించారు.గ్రామీణప్రాంతాలలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉండటంలేదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసిందని, సక్రమంగా విధులు నిర్వహించకుంటే ఇంటికి పోతారని ఈవిషయంలో ఎంపీవో రామచంద్రరావు కఠినంగా వ్యహరించాలని హెచ్చరించారు. మండలంలో వైద్యసిబ్బందితీరు బాగా ఉందన్నారు. కరోనా నిర్మూలనలో వారి పాత్ర వెలకంటలేనిదన్నారు. తహసీల్దార్‌ పుల్లయ్య పనితీరుపై ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో గదులను పరిశీలించారు.ఆసుపత్రికి వచ్చిన రోగులను వైద్యం గురించి అడిగితెలసుకున్నారు. బుధవారం కారు ప్రమాదంలో మృతిచెందిన గుగులోత్‌ హేమ నందిని కుటుంబాన్ని పరామర్శించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ శకుంతల, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ మల్లెల నాగేశ్వరరావు సీఐ శ్రీనివా్‌సలు, వైద్యులు హనుమంతరావు, చందన, ఎస్‌ఐ సురేష్‌, వైస్‌ ఎంపీపీ రావూరిశ్రీనివా్‌సరావు, అజ్మీర వీరన్న, ఎండీ హనీఫ్‌ పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-21T05:46:47+05:30 IST